Maha Kumbh: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ‘‘మహా కుంభమేళా’’ ముగిసింది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ కుంభమేళాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, వేల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసింది. అందుకు తగ్గట్లుగా, దేశ విదేశాల నుంచి ‘త్రివేణి సంగమం’’కి భక్తులు పోటెత్తారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగిన ఈ హిందూ కార్యక్రమానికి ఏకంగా 66 కోట్ల మంది భక్తులు వచ్చారు.
Read Also: Interfaith marriage: హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి లవ్.. జార్ఖండ్‌లో బెదిరింపులు, కేరళలో పెళ్లి..
ఇదిలా ఉంటే, కుంభమేళా పలు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంటోంది. వీటిలో ఏకకాలంలో నదిని శుభ్రపరచడం, ఒకే చోట శుభ్రపరిచే కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో స్వచ్ఛంద సేవకులు పాల్గొనడం, 8 గంటల్లోనే అత్యధిక మంది పాల్గొని హ్యాండ్ ఫ్రింట్ పెయింటింగ్ చిత్రాలను రూపొందించడం వంటి రికార్డులు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద శాంతియుత సమావేశంగా రికార్డులు సాధించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి కుంభమేళాకు 60 కోట్లకు పైగా భక్తులు రావడం కూడా ఒక రికార్డు.