NTV Telugu Site icon

Maha kumbh Mela 2025: నేటి నుంచి మహా కుంభమేళా షురూ..

Mahakumbh

Mahakumbh

Maha kumbh Mela 2025: గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్.. మహా కుంభ మేళాకు రెడీ అయింది. నేటి (జనవరి 13) నుంచి ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ప్రారంభం అయింది. పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ మహా కుంభ్.. సుమారు 45 రోజుల పాటు జరగనుంది. రాజ స్నానాలు ఆచరించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చారు. ఈ మహా కుంభమేళాకు 35 కోట్ల మంది భక్తులు తరలివచ్చే ఛాన్స్ ఉందని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది.

Read Also: Manda Jagannatham : మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి… సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఇక, మహా కుంభమేళాను ప్రశాంతంగా, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఉత్తర్‌ ప్రదేశ్‌ సర్కార్ భారీగా ఏర్పాట్లు చేసింది. భద్రతతో పాటు సౌకర్యాల కోసం సాంకేతిక సహకారాన్ని విస్తృతంగా ఉపయోగిస్తుంది. కృత్రిమ మేధ సహకారంతో దీనిని డిజిటల్‌ కుంభమేళాగా మార్చింది. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు చేశామని.. 50 లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.

Read Also: Hero Ajith : రేసింగ్ లో దుమ్ములేపిన అజిత్.. దేశ వ్యాప్తంగా ప్రశంసల వెల్లువ

అలాగే, భక్తుల యొక్క భద్రత కోసం 55 పోలీస్‌ స్టేషన్లను యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. 45,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు ఈ మహా కుంభ్ లో భాగం కానున్నాయి. ఆదివారం నాటికే లక్షల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చేశారు. శనివారం 25 లక్షల మంది పవిత్ర స్నానాలు చేసుకోగా.. తెలుగుతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ భాషల్లోనూ సేవలందించే కాల్‌ సెంటర్లను ఉత్తర ప్రదేశ్ సర్కార్ ఏర్పాట్లు చేసింది.

Show comments