ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. ఇప్పటికే దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా 10 దేశాలకు చెందిన ప్రతినిధులు పవిత్ర స్నానాలు చేశారు. 10 దేశాలకు చెందిన 21 మంది సభ్యులతో కూడిన బృందం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం దగ్గర పవిత్ర స్నానాలు చేశారు. ఈ బృందంలో ఫిజి, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, యూఏఈ ప్రతినిధులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Trump’s Inauguration: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఆహ్వానాలు అందుకున్న వారు వీరే..
గయానాకు చెందిన దినేష్ పెర్సాద్ మాట్లాడుతూ.. గంగా నదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తన కల నిజమైందన్నారు. ఎప్పటినుంచో గంగా నదిలో పుణ్య సాన్నం చేయాలని కోరిక ఉందని.. ఈరోజు నెరవేరిందని తెలిపారు. అందరూ స్నానం చేయాలని అందరినీ కోరారు. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన సాలీ ఎల్ అజాబ్ కూడా కుంభమేళాను అనుభవించడానికి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లిన అంతర్జాతీయ యాత్రికులలో ఒకరిగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Tollywood: నెపో కిడ్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా టాలీవుడ్ వెయిటింగ్!
45 రోజుల పాటు జరిగే మహా కుంభంలో నాలుగో రోజైన గురువారం ఉదయం వేలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రపంచంలోని అతి పెద్ద మత సమ్మేళనంలో 6 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా 3.5 కోట్లకు పైగా పాల్గొన్నారు. యాత్రికులు భారీగా తరలిరావడంతో ప్రయాగ్‌రాజ్ అడ్మినిస్ట్రేషన్ ఐఏ ఆధారిత కంప్యూటరైజ్డ్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేఠా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.
ఇది కూడా చదవండి: Tragedy: ప్రకాశం జిల్లా పాకల బీచ్‌లో ముగ్గురు మృతి.. మంత్రి దిగ్భ్రాంతి