Madras University: మద్రాస్ యూనివర్సిటీ వివాదంలో చిక్కుకుంది. ‘‘భారతదేశంలో క్రైస్తవ మతాన్ని ఎలా వ్యాప్తి చేయాలి’’ మరియు ‘‘ఈ మార్గం మనకు ఎందుకు అవసరం’’ అనే శీర్షికతో ఒక లెక్చర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే, దీనిపై సోషల్ మీడియాపై విస్తృతంగా విమర్శలు వచ్చాయి. దీంతో యూనివర్సిటీ ఈ లెక్చర్‌ని రద్దు చేసింది. ప్రాచీన చరిత్ర మరియు పురావస్తు శాస్త్ర విభాగం సుబ్రమణ్య అయ్యర్ ఎండోమెంట్ లెక్చర్ సిరీస్ కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.
Read Also: Pakistan: బలూచిస్తాన్‌లో ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలు హైజాక్ చేసిన బీఎల్ఏ..
డిపార్ట్‌మెంట్ హెడ్‌గా ఉన్న డాక్టర్ జే సౌందరరాజన్ జారీ చేసిన ఉపాన్యాస ఆహ్వానం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. మార్చి 14 ఇంజనీర్ కే శివకుమార్ నిర్వహించనున్న ఈ కార్యక్రమం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. హిస్టరీ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో ‘‘మతపరమైన అంశం’’ ఏంటని నెటిజన్లు ప్రశ్నించారు. అంతటా వ్యతిరేకత రావడంతో, పరిపాలనా కారణాలను చూపిస్తూ కార్యక్రమాన్ని రద్దు చేసింది. యూనివర్సిటీలు సున్నితమైన అంశాలపై ఉపన్యాసాలు ఎలా నిర్వహిస్తారు..? అని యూజర్లు ప్రశ్నించారు. దీనిపై నిర్వాహకులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ప్రజల నిరసనను చూసిన రిజిస్ట్రార్ జె సౌందరరాజన్ ఉపన్యాసాన్ని వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. యూనివర్సిటీ అధికారులు ఈ వివాదం నుంచి దూరంగా ఉన్నారు. ఈ వివాదం రాజకీయ రంగుని పులుముకుంది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్జీ సూర్య ఈ కార్యక్రమాన్ని విమర్శించారు.