NTV Telugu Site icon

Udhayanidhi Stalin: చివరి చిత్రమన్నాడు.. నిర్మాత నోటీసులు పంపాడు

Udhayanidhi Stalin

Udhayanidhi Stalin

Madras High Court Issued Notice To Udhayanidhi Stalin Over Angel Movie Issue: తాను చేసిన మామన్నన్ సినిమానే చివరిదని నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు.. అతడ్ని ఇరకాటంలో పడేశాయి. ఏకంగా హైకోర్టు నుంచి నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ నిర్మాత వెనకుండి ఈ పని చేశాడు. అంతేకాదు.. ఈనెల 29న విడుదలకి సిద్ధంగా ఉన్న ‘మానన్నన్’ రిలీజ్‌ని ఆపేయాలని ఆ నిర్మాత కోరాడు. అసలెందుకు ఆ నిర్మాత ఈ పని చేశాడు? పదండి.. ఆ వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

Manipur: మంత్రి గోడౌన్‌కు నిప్పుపెట్టిన దుండగులు.. ఇంటిని తగలబెట్టేందుకు యత్నం

మానన్నన్ సినిమా ప్రారంభించడానికి ముందే.. నిర్మాత రామశరవణన్ నిర్మాణంలో స్టాలిన్ ఓ సినిమాకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సినిమాకి ‘ఏంజెల్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, ఆనంది కథానాయికలు. కేఎస్‌.అదయమాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయ్యింది. మరో 20 శాతం చిత్రీకరణ మాత్రమే మిగిలుంది. ఈ సినిమా కోసం నిర్మాత రూ.13 కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే.. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు ఆలస్యం అయ్యింది. ఈ గ్యాప్‌లో ఉదయనిధి స్టాలిన్ ‘మామన్నన్’ సినిమాని ప్రారంభించి, ఇప్పుడు రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. అంతేకాకుండా.. ఇదే తన చివరి చిత్రమని ప్రకటించాడు.

Bangalore Pre School: దారుణం.. క్లాస్ రూంలో చిన్నారిపై దాడి చేసిన బాలుడు

ఈ నేపథ్యంలోనే.. నిర్మాణ రామశరవణన్ కోర్టు మెట్లు ఎక్కారు. ‘మామన్నన్’ సినిమానే తన చివరి చిత్రమని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారని, మరి తన సినిమా సంగతేంటని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్టాలిన్ తన సినిమా పూర్తి చేయకపోతే, తాను చాలా నష్టపోతానని అన్నారు. కాబట్టి.. మామన్నన్ విడుదలపై నిషేధం విధించి, తన సినిమాని పూర్తి చేయాలంటూ స్టాలిన్‌ని ఆదేశించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ పిటిషన్‌ని విచారించిన మద్రాసు హైకోర్టు.. స్టాలిన్‌కు, ‘మామన్నన్’ నిర్మించిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆలోపు నోటీసులకు స్పందించాల్సిందిగా కోర్టు వారిని ఆదేశించింది.