Man Carry Father To Hospital On Handcart in madhya pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశాఖ పనితీరు ఎంత దారుణంగా ఉందో చూపించే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్స్ లేకపోవడంతో తమ వాళ్ల మృతదేశాలను బైకులపై తీసుకువెళ్లిన ఘటనలు చూశాం. చివరకు ఓ ఏడేళ్ల చిన్నవాడు తన తమ్ముడి మృతదేహాన్ని తన ఒడిలో పెట్టుకుని రోడ్డు పక్కన ఉన్న ఘటన కూడా మధ్యప్రదేశ్ మొరేనాలో చోటు చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
తాజాగా ఇలాంటి ఘటనే బుధవారం మరొకటి జరిగింది. అంబులెన్స్ కు ఫోన్ చేస్తే రాకపోవడంతో.. తన తండ్రిని తోపుడు బండిలో తీసుకువచ్చాడు ఓ కొడుకు. ఈ ఘటన మధ్యప్రదేశ్ భింద్ జిల్లా లహర్ పట్టణంలో జరిగింది. అనారోగ్యంగా ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కు ఫోన్ చేసిన రాకపోవడంతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకువచ్చాడు. మర్పురా గ్రామానికి చెందిన హరిస్ కృష్ణ తన తండ్రిని తోపుడుబండిలో 5 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఘటనలకు కారణమైనవారిపై చర్యలు తీసుకుంటామని లహర్ ఆస్పత్రి బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ధర్మేంద్ర శ్రీవాస్తవ తెలిపారు.
Read Also: Bjp Operation Akarsh: టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసల పర్వం
సరిగ్గా ఇలాంటి ఘటనే యూపీలో బుధవారం చోటు చేసుకుంది. జలాలాబాద్ పట్టణానికి చెందిన దినేష్ తన తల్లి బీనాదేవి(65)కు హఠాత్తుగా కడుపు నొప్పి రావడంతో అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. ఎంతసేపు చూసిన అంబులెన్స్ రాకపోవడవంతో తన తల్లిని తోపుడు బండిలొో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లాడు. తీసుకెళ్లే సమయానికే తల్లి మరణించిందని వైద్యులు వెల్లడించారు. తిరిగి మృతదేహాన్ని అదే తోపుడు బండిలో తీసుకువచ్చాడు. అయితే చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని 108 అధికారులు చెబుతున్నారు.
