Madhya Pradesh HC: మధ్యప్రదేశ్ హైకోర్టు లివ్-ఇన్ రిలేషన్ షిప్‌పై సంచలనాత్మక తీర్పును వెల్లడించింది. చట్టబద్ధంగా వివాహం కాకున్నా, పురుషుడితో చాలా కాలం పాటు జీవించిన స్త్రీకి, విడిపోయిన తర్వాత భరణం పొందేందుకు అర్హురాలే అని తీర్పునిచ్చింది. లివ్ ఇన్ రిలేషన్‌లో మహిళల హక్కుల్ని గుర్తించే దిశగా హైకోర్టు ముందడుగు వేసింది. ఇద్దరి మధ్య సహజీవనం ఉన్నట్లు రుజువైతే భరణాన్ని తిరస్కరించలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు ఉదహరిస్తూ.. స్త్రీ,పరుషులు భార్యభర్తలుగా జీవిస్తున్నారని నిర్థారణ అయిందని, రిలేషన్‌లో పిల్లలు పట్టుకను పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం మహిళకు భరణం పొందే హక్కు ఉందని ధ్రువీకరించింది. సహజీవనంలో ఉన్న మహిళకు నెలవారీ భత్యం రూ. 1500 చెల్లించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన తరుణంలో హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది.
Read Also: PM Modi: యుపి ర్యాలీలో “ఫ్లాప్ ఫిల్మ్” అంటూ వారి పై వ్యాఖ్యలు చేసిన పీఎం మోడీ..!
బాలాఘాట్‌కి చెందిన శైలేష్ బోప్చే అనే వ్యక్తి మహిళ ఆరోపణలపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్యగా చెప్పుకుంటున్న మహిళ, ఆలయంలో వివాహం చేసుకున్నట్లు రుజువు చేయలేకపోయిందని బోప్చే కోర్టుకు చెప్పాడు. ఈ కేసులో మహిళ చట్టబద్ధంగా అతని భార్య కాదని సీఆర్పీసీలోని సెక్షన్ 125 కింద మెయింటనెన్స్ మొత్తాన్ని డిమాండ్ చేయలేదని బోప్చే తరుపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. అయితే, జస్టిస్ జీఎస్ అహ్లువాలియాతో కూడిన సింగ్ బెంజ్ మహిళ కొంత కాలం సదరు వ్యక్తితో కలిసి జీవించిందనే వివరాలను గుర్తించింది. దీంతో ఆమె భరణానికి అర్హురాలే అని తీర్పు చెప్పింది.
ఇటీవల కాలం సమాజంలో లివ్ ఇన్ రిలేషన్ కేసుల పెరుగుతున్న తరుణంలో, ఇలాంటి సంబంధాల్లో మహిళల హక్కులను గుర్తించేందుకు ఈ తీర్పు ముందడుగుగా ఉపయోగపడనుంది. పెళ్లి కాకున్నా కొంత కాలం పాటు పురుషుడు, స్త్రీ కలిసి ఉండీ, ఆ తర్వాత విడిపోతే సదరు మహిళ హక్కుల విషయం ప్రశ్నార్థకంగా ఉండేది. అయితే, తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు వారికి కూడా హక్కుల్ని కల్పిస్తున్నట్లు సూచిస్తోంది. మరోవైపు ఈ ఏడాది ఉత్తరాఖండ్ తీసుకువచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు కూడా లివ్ రిలేషన్ విషయంలో రిజస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది.