Site icon NTV Telugu

Aukat Remark: డ్రైవర్‌ స్థాయి గురించి ప్రశ్నించినందుకు!.. కలెక్టర్‌పై బదిలీ వేటు

Madhya Pradesh

Madhya Pradesh

Aukat Remark: హిట్‌ అండ్ రన్‌ కేసులకు సంబంధించి భారత న్యాయ సంహితలోని నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్లతో స్థానిక కలెక్టర్ వ్యవహరించిన తీరు వివాదాస్పాదమైంది. ఈ నేపథ్యంలో షాజాపూర్ జిల్లా కలెక్టర్‌ను తొలగించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ఆదేశించారు. షాజాపూర్ జిల్లా కలెక్టర్ కిషోర్ కన్యల్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని ఆదేశించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి భాషను సహించబోమని ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ఆదేశాలు జారీ చేశారు. కన్యల్‌ను రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేశారు. బదిలీ తర్వాత, నార్సింగ్‌పూర్ కలెక్టర్ రిజు బఫ్నా షాజాపూర్ కొత్త కలెక్టర్‌గా నియమితులయ్యారు.

ట్రక్కు డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో మంగళవారం ఓ డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో షాజాపూర్‌ జిల్లా కలెక్టర్‌ కిషోర్ కన్యల్‌ సమావేశమయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని వారి హెచ్చరించారు. అంతలోనే తమ సరిగ్గా మాట్లాడాలంటూ ఓ ప్రతినిధి కోరగా.. ఆగ్రహానికి గురైన కలెక్టర్‌.. “నువ్వేం చేయగలవు? నీ స్థాయి ఎంత” అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. లారీ డ్రైవర్లపై కలెక్టర్ అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తంఖా వీడియోను షేర్ చేశారు. ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో కిషోర్ కన్యల్ క్షమాపణలు చెబుతూ వేదికపైకి వచ్చారు.

Read Also: IAS Officers Transfer : తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌ల బదిలీ

ఈ ఘటనపై ముఖ్యమంత్రి యాదవ్ స్పందిస్తూ.. ‘ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం’ అని అన్నారు. “ఎంత పెద్ద అధికారి అయినా పేదల పనిని, భావాలను గౌరవించాలి. మనిషిగా మా ప్రభుత్వం ఈ రకమైన భాషను సహించదు. నేను కూడా తాను కూలీ కొడుకునని” అని సీఎం మోహన్‌ యాదవ్ చెప్పారు. “ఇలాంటి అధికారులకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అర్హత లేదు’ అని సీఎం మోహన్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

కొత్త హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్రంతో కీలక చర్చ తర్వాత సమ్మెను విరమించారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఏఐఎంటీసీ) వెల్లడించింది. సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని ఏఐఎంటీసీ తెలిపింది. హిట్ అండ్ రన్ చట్టంలోని కొత్త శిక్షా నిబంధనలకు వ్యతిరేకంగా తమ నిరసనను వెంటనే ఉపసంహరించుకుంటామని ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. 10 సంవత్సరాల (హిట్ అండ్ రన్ కేసుల్లో) శిక్ష విధించే చట్టంపై ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్‌తో చర్చలు జరిగాయని అజయ్ భల్లా తెలిపారు. కొత్త శిక్షాస్మృతి యొక్క కఠినమైన ‘హిట్-అండ్-రన్’ నిబంధనకు వ్యతిరేకంగా డ్రైవర్లు, ట్రక్కర్లు నిరసన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం ప్రకటించారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో హైవేలను ఆందోళనకారులు దిగ్బంధించారు.

Exit mobile version