Aukat Remark: డ్రైవర్ స్థాయి గురించి ప్రశ్నించినందుకు!.. కలెక్టర్‌పై బదిలీ వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aukat Remark: హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి భారత న్యాయ సంహితలోని నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్లతో స్థానిక కలెక్టర్ వ్యవహరించిన తీరు వివాదాస్పాదమైంది. ఈ నేపథ్యంలో షాజాపూర్ జిల్లా కలెక్టర్‌ను తొలగించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశించారు. షాజాపూర్ జిల్లా కలెక్టర్ కిషోర్ కన్యల్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని ఆదేశించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి భాషను సహించబోమని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. కన్యల్‌ను రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేశారు. బదిలీ తర్వాత, నార్సింగ్‌పూర్ కలెక్టర్ రిజు బఫ్నా షాజాపూర్ కొత్త కలెక్టర్‌గా నియమితులయ్యారు.
ట్రక్కు డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో మంగళవారం ఓ డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో షాజాపూర్ జిల్లా కలెక్టర్ కిషోర్ కన్యల్ సమావేశమయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని వారి హెచ్చరించారు. అంతలోనే తమ సరిగ్గా మాట్లాడాలంటూ ఓ ప్రతినిధి కోరగా.. ఆగ్రహానికి గురైన కలెక్టర్.. “నువ్వేం చేయగలవు? నీ స్థాయి ఎంత” అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. లారీ డ్రైవర్లపై కలెక్టర్ అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తంఖా వీడియోను షేర్ చేశారు. ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో కిషోర్ కన్యల్ క్షమాపణలు చెబుతూ వేదికపైకి వచ్చారు.
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
Read Also: IAS Officers Transfer : తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌ల బదిలీ
ఈ ఘటనపై ముఖ్యమంత్రి యాదవ్ స్పందిస్తూ.. ‘ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం’ అని అన్నారు. “ఎంత పెద్ద అధికారి అయినా పేదల పనిని, భావాలను గౌరవించాలి. మనిషిగా మా ప్రభుత్వం ఈ రకమైన భాషను సహించదు. నేను కూడా తాను కూలీ కొడుకునని” అని సీఎం మోహన్ యాదవ్ చెప్పారు. “ఇలాంటి అధికారులకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అర్హత లేదు’ అని సీఎం మోహన్ యాదవ్ పేర్కొన్నారు.
కొత్త హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్రంతో కీలక చర్చ తర్వాత సమ్మెను విరమించారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఏఐఎంటీసీ) వెల్లడించింది. సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని ఏఐఎంటీసీ తెలిపింది. హిట్ అండ్ రన్ చట్టంలోని కొత్త శిక్షా నిబంధనలకు వ్యతిరేకంగా తమ నిరసనను వెంటనే ఉపసంహరించుకుంటామని ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. 10 సంవత్సరాల (హిట్ అండ్ రన్ కేసుల్లో) శిక్ష విధించే చట్టంపై ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్‌తో చర్చలు జరిగాయని అజయ్ భల్లా తెలిపారు. కొత్త శిక్షాస్మృతి యొక్క కఠినమైన ‘హిట్-అండ్-రన్’ నిబంధనకు వ్యతిరేకంగా డ్రైవర్లు, ట్రక్కర్లు నిరసన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం ప్రకటించారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో హైవేలను ఆందోళనకారులు దిగ్బంధించారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్‌ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!