Site icon NTV Telugu

Lufthansa Airlines: హైదరాబాద్ నుంచి జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్‌కి డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం..

Lufthansa Airlines

Lufthansa Airlines

Lufthansa Airlines: తెలుగు రాష్ట్రాల నుంచి జర్మనీ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కి డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించింది. జనవరి 17 నుంచి ఈ ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌ని ప్రపంచానికి అనుసంధానం చేయడం, వాణిజ్యం కోసం గ్లోబల్ హబ్‌గా మార్చడానికి ఇది సహకరిస్తుందని GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఓ ప్రకటనలో తెలిపింది.

Read Also: Delhi: ఢిల్లీలో కమ్ముకున్న పొగమంచు.. పలు విమానాలు రద్దు.. రైళ్లు ఆలస్యం..

వారంలో ఐదు రోజులు(సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం మరియు శనివారం) LH753 ఫ్లైట్ హైదరాబాద్ నుంచి 01:55 గంటలకు బయలుదేరి 07:05 గంటలకు ఫ్రాంక్‌ఫర్ట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో LH752 విమానం ఫ్రాంక్‌ఫర్ట్ నుండి 10:55 గంటలకు బయలుదేరి 23.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఇటీవల కాలంలో భారత్ నుంచి ఉత్తర అమెరికాకు ప్రయాణించే వారిలో 40 శాతం మంది యూరప్ విమానాశ్రయాలను ట్రాన్సిట్ హబ్స్‌గా ఎంచుకుంటున్నారు. ఇలాంటి వారికి లుఫ్తాన్సా ఫ్లైట్స్ సరిగ్గా సరిపోనుంది.

Exit mobile version