Puri Rath Yatra 2025: నేడే పూరీ జగన్నాథుని రథయాత్ర.. భారీగా భద్రతా ఏర్పాట్లు..
- నేడే పూరీ జగన్నాథుని రథయాత్ర..
- భక్తులతో నిండిపోయిన పూరీ ఆలయ పరిసరాలు..
- రథయాత్ర కోసం భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Rath Yatra 2025: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథ యాత్ర మరి కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక, లక్షలాది మంది భక్తులు ఈ రథాల వెంటరాగా జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి రథాలపై తరలి వెళ్లనున్నారు. ఆలయ పరిసరాలన్నీ ఒక్కసారిగా భక్తులతో నిండిపోయాయి. ఈ వేడుకలో సుమారు 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేసిన అధికారులు.. అందుకు తగినట్లుగా ఏర్పాట్లను చేశారు.
Read Also: Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రా దూరం!
Also Read
- Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
అయితే, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి భద్రతకు ప్రాధాన్యమిచ్చింది. ఈసారి ఏకంగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. దీంతో పాటు 10 వేల మంది జవాన్లను సర్కార్ నియమించింది. భూతల, జల, వాయు మార్గాలపై నిఘా ఉంచినట్లు ఒడిశా డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా వెల్లడించారు. అలాగే, భద్రతతో పాటు వైద్య సేవలకూ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీఠ వేసింది. ఈ ఏడాది రథయాత్ర సందర్భంగా 69 తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు, 64 అంబులెన్స్‌లు, 265 ప్రత్యేక ఆసుపత్రి పడకలు, 378 అదనపు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది డ్యూటీలో ఉండనున్నారు. ఏఐఎమ్ఎస్ భువనేశ్వర్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఈసారి పూరీలోని రథయాత్ర వద్ద విధులు నిర్వహించనున్నారు. యాత్రను భద్రంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు భక్తుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?