Himanta Biswa Sarma: మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌పై అస్సా్ం సీఎం హిమంత బిశ్వ సర్మ విమర్శలు గుప్పించారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌ని టార్గెట్ చేశారు. భగవాన్ మహదేవ్‌ని కూడా విడిచి పెట్టడం లేదని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 17న ఛత్తీస్‌గఢ్ రెండో విడత పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ తరుపున హిమంత ప్రచారం చేశారు. కాంగ్రెస్ నేతలకు, నక్సలైట్లకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. గిరిజనులను మతమార్పిడి చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
Read Also: Rakshit Shetty: ఆమెను ఎంతో ప్రేమించా.. కానీ, వాడు ఆ పని చేసి..
‘‘ ఇటీవల నేను బిలాస్‌పూర్‌లో ఉన్నప్పుడు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా భూపేష్ బఘేల్‌కి రూ.508 కోట్లు అందాయని తెలిసింది. ఈడీ తక్కువ డబ్బును రాసిందనిపిస్తోందని, అంతకంటే ఎక్కువ డబ్బు ఈ కుంభకోణంలో లూటీ చేయబడింది. బఘేల్ సీఎంగా 2.5 ఏళ్లు, మిగిలిన 2.5 ఏళ్లు సీఎంగా ఉండాలని అనునకున్నారు. బఘేల్ మొత్తం పదవీకాల పెరిగింది. ఇది డబ్బు మార్పిడి లేకుండా సాధ్యం కాదు’’ అని హిమంత బిశ్వ సర్మ ఆరోపించారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల ద్వారా సీఎం బఘేల్ కి రూ.508 కోట్లు చెల్లించారని, డబ్బుతో పట్టుబడిన కొరియర్లు వాగ్మూలం ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. అయితే ఈ ఆరోపణల్ని బఘేల్ ఖండించారు. ఇది బీజేపీ నాటకమని విమర్శించారు.
బెట్టింగ్ యాప్‌కి హిందూదేవుడి పేరు పెట్టడంపై హిమంత శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యాప్ కి భూపేష్ అని పెట్టడం లేదా.. హిమంత అనే పేరు పెట్టాల్సింది.. కానీ దానికి మహాదేవ్ పేరు పెట్టారు, ఇప్పడు బఘేల్ మహాదేవ్ ని వదల్లేదు, ప్రతీ పైసా ఖాతాలో వేసుకుంటాడని, మీరు మీ ఖాతా ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ హిమంత అన్నారు. కోట్లాది రూపాయల బెట్టింగ్ కుంభకోణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని బీజేపీ నేత హెచ్చరించారు. మహదేశ్ పేరుతో మోసం చేసిన వారిని వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అన్నారు.
