Site icon NTV Telugu

Girl Marriage with Lord Krishna: శ్రీకృష్ణ భగవానుడికే ఇచ్చి కుమార్తె పెళ్లి చేసిన వ్యాపారవేత్త..

Girl Marriage With Lord Kri

Girl Marriage With Lord Kri

ఓ వ్యాపారవేత్త తన కుమార్తెకు శ్రీకృష్ణుడితో కోలాహలంగా వివాహం జరిపించాడు.. ఈ తంతుకు బంధుమిత్రులను అందరినీ పిలిచి గ్రాండ్‌గా పెళ్లి చేశారు.. అదేంటి..? కూతురికి శ్రీకృష్ణ భగవానుడితో వివాహం జరిపించడం ఏంటి? అనే ఆశ్చర్యపోకండి… విషయం ఏంటంటే.. అనారోగ్యంతో మంచం పట్టిన తన కుమార్తె కోరికను తీర్చడానికి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శ్రీకృష్ణుడితో పెళ్లి చేశాడు ఆ తండ్రి.. భగవంతుడితో కూతురుకు పెళ్లికి ఎలా జరిపించారనే వివరాల్లోకి వెళ్తే.. శివపాల్ అనే వ్యాపారవేత్తకు దివ్యాంగురాలైన 26 ఏళ్ల కుమార్తె ఉంది.. ఆమె మాట్లాడలేదు, ఏమీ వినలేదు కూడా.. 21 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన కుమార్తెను శివపాల్ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ వస్తున్నాడు.. అయితే, తన కుమార్తెకు వివాహం జరగడం కష్టమని భావించిన ఆయన.. తన కుమార్తెను శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేయాలని భావించి.. తన ఆలోచనను అమలు చేశాడు..

Read Also: Stolen in Police Station: పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం.. ఏం ఎత్తుకెళ్లాడో తెలిస్తే షాకే..!

ఇందుకోసం ఓ అమ్మాయికి కృష్ణుడి వేషం కట్టించారు.. ఇక, ఏర్పాట్లలో ఎక్కడా తగ్గేదేలే అనే తరహాలో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు.. బృందావనం నుండి భారీ ఊరేగింపుగా.. బారాత్ బ్యాండ్ మరియు డీజే, లైట్ల వెలుగుల్లో నృత్యాలు చేస్తూ వధువు ఇంటికి కృష్ణయ్య చేరుకున్నారు.. ఆ తర్వాత వివాహాన్ని జరిపించారు.. మొత్తంగా.. నడవలేని నరాల సంబంధిత రుగ్మతతో బాధపడుతోన్న తన కుమార్తెను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకపోవడం.. ఎన్నో ఆస్పత్రులు తిరిగినా.. తన కుమార్తెకు నయం కాకపోవడం.. తన వయసులో ఉన్న అందరు ఆడపిల్లల్లాగే ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవాలని అనుకోవడంతో.. తండ్రి ఆమెను శ్రీకృష్ణ భగవానుడికే అప్పగించాలని నిర్ణయానికి వచ్చి ఇలా పెళ్లి జరిపించాడు.. తన కూతురు కోరికను కూడా తీర్చినవాడయ్యారు.. మొత్తంగా ఈ వివాహం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..

Exit mobile version