NTV Telugu Site icon

India On Iran: ‘‘మీ సొంత రికార్డు చూసుకో’’.. మైనారిటీలపై ఇరాన్ సుప్రీం లీడర్ కామెంట్లపై భారత్ ఫైర్..

India On Iran

India On Iran

India On Iran: భారతీయ ముస్లింలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయ ముస్లింల బాధల్ని గాజాలోని పరిస్థితిలో పోల్చాడు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘”భారత్‌లోని మైనారిటీలకు సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Ganesh Nimajjanam: వినాయక నిమజ్జనంలో అపశృతి.. బాణసంచా పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

‘‘ఇది తప్పుడు సమాచారం ఆమోదయోగ్యం కాదు. మైనారిటీలపై వ్యాఖ్యానించే దేశాలు, ఇతరుల గురించి మాట్లాడే ముందు తమ సొంత రికార్డుల్ని చూసుకోవాలి’’ అని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖమేనీ తన పోస్టులో ‘‘ మయన్మార, గాజా, భారతదేశం లేదా మరేదైనా ప్రాంతంలో ఒక ముస్లిం పడుతున్న బాధలను మనం పట్టించుకోకపోతే మనం ముస్లింలుగా పరిగణించలేము’’ అని అన్నారు. ఇస్లాం యొక్క శత్రువులు ఎల్లప్పుడూ మమ్మల్ని ఉదాసీనంగా చేయడానికి ప్రయత్నిస్తారు అన్నారు. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య శత్రుత్వాల మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Show comments