Site icon NTV Telugu

Supreme Court: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. సహజీవనం చేస్తే పెళ్లి అయినట్టే..!

Supreme Court

Supreme Court

సహజీవనానికి సంబంధించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. సహజీవనం చేసిన జంటకు కలిగిన సంతానం విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ఓ జంట.. భార్యాభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి సహజీవనం చేశారంటే వారిద్దరూ మ్యారేజ్‌ చేసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు..

Read Also: Bus Charges: చార్జీలు పెంచండి.. ఏపీఎస్‌ ఆర్టీసీకి టీఎస్‌ ఆర్టీసీ రిక్వెస్ట్

కేరళకు చెందిన ఓ జంట సుదీర్ఘకాలం పాటు సహజీవనం చేయగా.. వారికి ఓ కుమారుడు కూడా పుట్టాడు.. అయితే, ఆ జంట పెళ్లి చేసుకున్నట్లు సాక్ష్యాలు లేని కారణంగా.. ఇది అక్రమ సంతానం.. ఆ సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కదని పేర్కొంటూ 2009లో కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది.. అయితే, ఈ వ్యవహారం కాస్తా సుప్రీంకోర్టుకు చేరింది.. జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేరళ హైకోర్టు తీర్పును విభేదించింది. ఓ జంట దీర్ఘకాలం పాటు సహజీవనం చేశారంటే వారికి వివాహం జరిగినట్టుగానే భావించాలని.. సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్‌ 114 ఈ మేరకు సూచిస్తోందని పేర్కొన్నారు. అంతే కాదు, దీనిని ఎవరైనా సవాల్‌ చేయవచ్చు.. కానీ, వారు వివాహం చేసుకోలేదని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా ఆ సవాల్‌ చేసినవారిపైనే ఉంటుందని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు..

Exit mobile version