Lok sabha: నేటి నుంచి 3 రోజులు ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ
- నేటి నుంచి 3 రోజులు ప్రత్యేక సమావేశాలు
- మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ
- డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించిన ఇండియా కూటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు దిశగా మోడీ ప్రభుత్వం వెళ్తోంది. నారీమణులకు పెద్ద పీట వేస్తూ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేయబోతుంది. దేశ రాజకీయాల్లోనే ఇదొక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.
నేటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. 2023లో ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ చట్టమైన నారీ శక్తి వందన్ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడమే ఈ బిల్లుల లక్ష్యం. 2029 నాటికి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడం, లోక్‌సభలో సభ్యుల సంఖ్యను 850కు పెంచడమే మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ఇది కూడా చదవండి: Women Reservation Bill: మహిళా కోటాలో సొంత స్థానాలు కోల్పోయే కేంద్రమంత్రులు వీళ్లే!
మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడుతుండగా.. మూడో బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో 18 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు. అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ 10 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు.
ఇదిలా ఉంటే డీలిమిటేషన్ బిల్లును ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కేంద్రం దురుద్దేశంతోనే తీసుకొస్తోందని ఆరోపించింది. అయితే బిల్లులపై ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య ఫైటింగ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందుతాయా? లేదా అన్నది వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: INDIA Bloc: ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్ బిల్లు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన
తాజావార్తలు
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?