NTV Telugu Site icon

Delhi: ఆల్‌పార్టీ నేతలతో స్పీకర్ భేటీ.. మోడీ, రాహుల్ హాజరు

Ombirla

Ombirla

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. వాస్తవానికి సభలు ఆగస్టు 12 వరకు జరగాల్సి ఉండగా.. మూడు రోజుల ముందుగానే సమావేశాలు ముగిశాయి. ఇదిలా ఉంటే సెషన్స్ వాయిదా పడగానే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. అన్ని పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, తదితర కేంద్రమంత్రులు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నుంచి ఫ్లోర్‌ లీటర్లు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: Delhi: ఆల్‌పార్టీ నేతలతో స్పీకర్ భేటీ.. మోడీ, రాహుల్ హాజరు

జూలై 22న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మోడీ 3.0 ప్రభుత్వం జూలై 23న 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా.. మూడు రోజుల ముందే స్పీకర్ ఓం బిర్లా నిరవధిక వాయిదా వేశారు. అలాగే రాజ్యసభ కూడా వాయిదా పడింది. ఆర్థిక బిల్లు మాత్రం ఆమోదం పొందింది. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ చట్టాన్ని సవరించే బిల్లు కూడా ప్రవేశపెట్టబడింది. నిబంధనలపై నిరసనలు వ్యక్తం కావడంతో పార్లమెంటు సంయుక్త కమిటీకి సిఫార్సు చేశారు.

 

Show comments