LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి అస్వస్థత
- ఆస్పత్రిలో చేరిక.. నిలకడగా ఆరోగ్యం!
- వైద్యుల పర్యవేక్షణలో సీనియర్ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే.అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్తో పాటు వయోభారానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. 98 ఏళ్ల అద్వానీకి శుక్రవారం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరిక
Also Read
- Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
అద్వానీ శుక్రవారం రాత్రి సుమారు 7.30 గంటలకు ఆస్పత్రికి వచ్చినట్లు సమాచారం. ఆయనను పల్మనాలజీ విభాగంలో చేర్చి, వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఛాతీలో ఇన్ఫెక్షన్తో పాటు వయస్సు కారణంగా ఎదురవుతున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో వైద్యులు ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నారు. అద్వానీకి ఈ ఏడాది ఆస్పత్రిలో చికిత్స అందించడం ఇది రెండోసారి. 2026 మేలో కూడా వయోభారానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 2024లోనూ అద్వానీ పలుమార్లు ఆస్పత్రిలో చేరారు. అదే ఏడాది జూన్ 26న వయోసంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. యూరాలజీ, వృద్ధాప్య వైద్యం తదితర విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించింది. మరుసటి రోజు ఆయనను డిశ్చార్జ్ చేశారు.
బీజేపీ వ్యవస్థాపక నేతల్లో ఒకరు
లాల్ కృష్ణ అద్వానీ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరు. ఆయన 1999 నుంచి 2004 వరకు కేంద్ర హోంమంత్రిగా, 2002 నుంచి 2004 వరకు ఉప ప్రధానిగా పనిచేశారు. దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం కీలక పాత్ర పోషించిన ఆయనకు ప్రజా జీవితానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2024 మార్చిలో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు.
తాజావార్తలు
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!