LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఢిల్లీ ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LK Advani: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మెరుగుపడటంతో ఢిల్లీలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా అక్టోబర్ 16న ఆయనను ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడటంతో సోమవారం వైద్యులు ఇంటికి పంపించారు. ప్రస్తుతం వయస్సు 98 సంవత్సరాలు. అద్వానీ న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజీ వైద్యుడు డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో వైద్య సేవలు అందించారు. అద్వానీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు ఆసుపత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 16న ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరిన ఆయనను, వైద్య పరిస్థితిలో మెరుగుదల కనిపించడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలిపింది.
భారత రాజకీయాల్లో అద్వానీ కీలక పాత్ర
Also Read
- Annamalai: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. అన్నామలై కీలక ప్రకటన..
- Lawrence Bishnoi History: కాలేజ్ స్టూడెంట్ నుంచి గ్యాంగ్‌స్టర్ దాకా.. పోలీస్ కొడుకు లారెన్స్ బిష్ణోయ్ హిస్టరీ ఇదే..!
- Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్..!
- Thiruvananthapuram Airport: అరుదైన సంప్రదాయం.. అక్టోబర్ 20న 5 గంటల పాటు విమానాలు నిలిపివేత..!
లాల్ కృష్ణ అద్వానీ భారత రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుల్లో ఒకరు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1999 నుంచి 2004 వరకు కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. 2002 నుంచి 2004 వరకు ఉప ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించారు. 1927 నవంబర్ 8న అప్పటి బ్రిటిష్ భారతదేశంలోని కరాచీలో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) జన్మించిన అద్వానీ, 1942లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో స్వయంసేవక్‌గా చేరారు. అనంతరం భారత రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు.
తాజావార్తలు
-
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఢిల్లీ ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
-
Explainer: యుద్ధంలోకి మరో ముస్లిం దేశం..తగలబడుతున్న మధ్యప్రాచ్యం!
-
Mohammed Shami: బుమ్రాకు ఒక న్యాయం, షమీకి మరో న్యాయమా?.. బీసీసీఐని నిలదీసిన కైఫ్!
-
CM Chandrababu: ఓటు ఒక ఆయుధం.. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం
-
IPCC: 1000మంది సైంటిస్టులు..100 గంటలు.. ఒక్కటే తీర్పు.. ముందుంది ముసళ్ల పండగ!
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!