NTV Telugu Site icon

Supreme court: ‘‘ బుల్డోజర్ న్యాయం ‘‘పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Supreme Court

Supreme Court

Supreme court: ‘‘బుల్డోజర్ న్యాయం’’పై ఈ నెలలో రెండోసారి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరారోపణ ఆస్తిని కూల్చివేయడానికి ఎలాంటి ఆధారం కాదని, అలాంటి చర్యలు దేశ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. గుజరాత్‌లోని ఖేడా జిల్లాకు చెందిన జావేద్ అలీ మెహబూబామియా సయీద్ దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించిన న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, సుధాన్షు ధులియా, ఎస్‌విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. అక్రమాస్తుల కేసు నమోదైన తర్వాత తన కుటుంబానికి చెందిన ఇంటిని బుల్డోజర్లతో కూల్చేస్తామని మున్సిపల్ అధికారులు బెదిరించారని అత్యున్నత న్యాయస్థానం ముందు చెప్పారు.

సయీద్ తరుపు న్యాయవాది కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. కాత్‌లాల్ గ్రామ రెవెన్యూ రికార్డులు, ఇల్లు ఉన్న చోటుకి తన క్లయింట్ సహ యజమాని అని సుప్రీంకోర్టులో చెప్పాడు. అతడి కుటుంబం మూడు తరాలుగా రెండు దశాబ్ధాలుగా నివాసం ఉంటున్న స్థలంలో 2004 ఆగస్టులో గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం మేరకు ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి లభించిందని చెప్పారు. సెప్టెంబర్ 02న సుప్రీంకోర్టు ఇల్లు కూల్చేముందు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా న్యాయవాది గుర్తు చేశారు.

Read Also: CS Neerabh Kumar Prasad: ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధమైన పాలన ఉన్న దేశంలో.. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి నేరం కుటుంబంలోని ఇతర సభ్యులపై లేదా చట్టబద్ధంగా నిర్మించిన నివాసంపై చర్యలు తీసుకోలేవని పేర్కొంది. నేరంలో ప్రమేయం ఆస్తిని కూల్చివేయడానికి ఎలాంటి కారణం కాదు అని బెంచ్ పేర్కొంది. సయీద్‌పై కేసు మాత్రమే నమోదైందని, దానిని చట్టపరమైన ప్రక్రియ ద్వారా కోర్టులో రుజువు చేయాలని సూచించింది.

‘‘చట్టం అత్యున్నతమైన దేశంలో అనూహ్యమైన ఇలాంటి కూల్చివేత బెదిరింపులను కోర్టు విస్మరించదు. లేదంటే ఇలాంటి చర్యలు చట్టాలపై బుల్డోజర్లను నడుపుతున్నట్లు చూడవచ్చు’’అని బెంజ్ పేర్కొంది. ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వానికి నోటీసలు జారీ చేసి నాలుగు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సయీద్ ఇంటిని కూల్చివేయొద్దని ఆదేశించింది.

ఇలా బుల్డోజర్ న్యాయంపై సెప్టెంబర్ 02న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “కేవలం నిందితుడు లేదా దోషి అయినందున కూల్చివేత ఎలా అవుతుంది… అనధికారికంగా నిర్మాణం జరిగితే జరిమానా. కొంత క్రమబద్ధీకరణ ఉండాలి. మేము ఒక విధానాన్ని రూపొందిస్తాము. మీరు మున్సిపల్ చట్టాలను ఉల్లంఘిస్తేనే కూల్చివేస్తామని చెబుతున్నారు, వాటికి మార్గదర్శకాల అవసరం ఉంది, దానిని డాక్యుమెంట్ చేయాలి.” అని వ్యాఖ్యానించింది.