Supreme court: ‘‘ బుల్డోజర్ న్యాయం ‘‘పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- బుల్డోజర్ న్యాయంపై మరోసారి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..
- నేర ప్రమేయం ఇళ్లు కూల్చివేతకు ఆధారం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme court: ‘‘బుల్డోజర్ న్యాయం’’పై ఈ నెలలో రెండోసారి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరారోపణ ఆస్తిని కూల్చివేయడానికి ఎలాంటి ఆధారం కాదని, అలాంటి చర్యలు దేశ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. గుజరాత్‌లోని ఖేడా జిల్లాకు చెందిన జావేద్ అలీ మెహబూబామియా సయీద్ దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించిన న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, సుధాన్షు ధులియా, ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. అక్రమాస్తుల కేసు నమోదైన తర్వాత తన కుటుంబానికి చెందిన ఇంటిని బుల్డోజర్లతో కూల్చేస్తామని మున్సిపల్ అధికారులు బెదిరించారని అత్యున్నత న్యాయస్థానం ముందు చెప్పారు.
సయీద్ తరుపు న్యాయవాది కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. కాత్లాల్ గ్రామ రెవెన్యూ రికార్డులు, ఇల్లు ఉన్న చోటుకి తన క్లయింట్ సహ యజమాని అని సుప్రీంకోర్టులో చెప్పాడు. అతడి కుటుంబం మూడు తరాలుగా రెండు దశాబ్ధాలుగా నివాసం ఉంటున్న స్థలంలో 2004 ఆగస్టులో గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం మేరకు ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి లభించిందని చెప్పారు. సెప్టెంబర్ 02న సుప్రీంకోర్టు ఇల్లు కూల్చేముందు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా న్యాయవాది గుర్తు చేశారు.
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
Read Also: CS Neerabh Kumar Prasad: ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధమైన పాలన ఉన్న దేశంలో.. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి నేరం కుటుంబంలోని ఇతర సభ్యులపై లేదా చట్టబద్ధంగా నిర్మించిన నివాసంపై చర్యలు తీసుకోలేవని పేర్కొంది. నేరంలో ప్రమేయం ఆస్తిని కూల్చివేయడానికి ఎలాంటి కారణం కాదు అని బెంచ్ పేర్కొంది. సయీద్‌పై కేసు మాత్రమే నమోదైందని, దానిని చట్టపరమైన ప్రక్రియ ద్వారా కోర్టులో రుజువు చేయాలని సూచించింది.
‘‘చట్టం అత్యున్నతమైన దేశంలో అనూహ్యమైన ఇలాంటి కూల్చివేత బెదిరింపులను కోర్టు విస్మరించదు. లేదంటే ఇలాంటి చర్యలు చట్టాలపై బుల్డోజర్లను నడుపుతున్నట్లు చూడవచ్చు’’అని బెంజ్ పేర్కొంది. ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వానికి నోటీసలు జారీ చేసి నాలుగు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సయీద్ ఇంటిని కూల్చివేయొద్దని ఆదేశించింది.
ఇలా బుల్డోజర్ న్యాయంపై సెప్టెంబర్ 02న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “కేవలం నిందితుడు లేదా దోషి అయినందున కూల్చివేత ఎలా అవుతుంది… అనధికారికంగా నిర్మాణం జరిగితే జరిమానా. కొంత క్రమబద్ధీకరణ ఉండాలి. మేము ఒక విధానాన్ని రూపొందిస్తాము. మీరు మున్సిపల్ చట్టాలను ఉల్లంఘిస్తేనే కూల్చివేస్తామని చెబుతున్నారు, వాటికి మార్గదర్శకాల అవసరం ఉంది, దానిని డాక్యుమెంట్ చేయాలి.” అని వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!