Manipur: మణిపూర్ రాష్ట్రంలో ఎన్ బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు పూర్తి విశ్వాసం కోల్పోయారని మణిపూర్ హింసాకాండకు చెందిన తొమ్మిది మంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఐదు అంశాలపై ప్రధాని మోదీకి మెమోరాండం సమర్పించిన ఎమ్మెల్యేలు.. రాష్ట్ర ప్రభుత్వంపై, పరిపాలనపై నమ్మకం, విశ్వాసం లేవని పేర్కొన్నారు. దీంతో జాతుల మధ్య వైరంతో మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఒప్పుకున్నట్టు అయింది. హింసలో 100 మందికి పైగా మరణించారని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని మెమోరాండంలో తెలిపారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మైతీ, కుకీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపాలని కోరారు. మరోవైపు మైతీ వర్గ బీజేపీ, ఎన్‌పీపీ ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులను కలిశారు.
Read also: World Cup 2023 Schedule: ఇంకా విడుదల కాని 2023 ప్రపంచకప్ షెడ్యూల్.. అసలు కారణం పాకిస్తాన్!
మైతీ, కుకీ తెగల ప్రజలు ఆయుధాలు చేతబట్టి బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఎప్పుడు, ఎటువైపు నుంచి ప్రమాదం తరుముకొస్తుందో తెలియక రాత్రింబవళ్లు పహారా కాస్తున్నారు. మగవారు ఆయుధాలు చేతబట్టి గ్రామాలను రక్షిస్తుంటే.. మహిళలు వారికి వండిపెడుతూ ఆకలిదప్పులు తీరుస్తున్నారు. రాష్ట్రంలో 18 నుంచి 45 ఏండ్ల వయసులోపు వారు తుపాకులు చేతబట్టి మిలిటెంట్ల నుంచి గ్రామాలను కాపాడుకునే పనిలో ఉండగా.. వృద్ధులు పహారా కాస్తున్నారు. మాజీ సైనికుడైన 48 ఏండ్ల బాబీ సింగ్ తన గ్రామంలోని యువతకు తుపాకులపై శిక్షణ ఇస్తున్నారు. కంగ్‌పోక్పి గ్రామానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు తుపాకులు, పేలుడు పదార్థాలను చేతబట్టుకుని గ్రామ రక్షణలో నిమగ్నమయ్యారు.
Read also: Jagadish Reddy: దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ నిరసనలు.. జగదీష్ రెడ్డి సీరియస్
చట్ట పరిధిలో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే తద్వారా ప్రజల విశ్వాసం మరియు నమ్మకం పునరుద్ధరించబడుతుందని ప్రధానికి రాసిన మెమోరాండంలో బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. మెమోరాండంపై స సంతకం చేసిన తొమ్మిది మంది బిజెపి ఎమ్మెల్యేలు — కరమ్ శ్యామ్ సింగ్, తోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్, నిషికాంత్ సింగ్ సపమ్, ఖ్వైరక్‌పం రఘుమణి సింగ్, ఎస్ బ్రోజెన్ సింగ్, టి రాబింద్రో సింగ్, ఎస్ రాజేన్ సింగ్, ఎస్ కేబీ దేవి, వై రాధేశ్యామ్. వీరంతా మెయిటీ కమ్యూనిటీకి చెందినవారు. కుకీ ఎమ్మెల్యేలు, మైతీ ఎమ్మెల్యేల మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు అభ్యర్థించారు. మణిపూర్‌లోని అన్ని ప్రాంతాలలో ఒకేరీతిలో కేంద్ర బలగాలను మోహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమగ్రతపై రాజీ పడకూడదని, ఏ సంఘం ప్రత్యేక పరిపాలన కోసం చేసిన అభ్యర్థనను ఎట్టిపరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోరాదని కూడా మెమోరాండం నొక్కి చెప్పింది. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌కు నిరసనగా మే 3న కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించిన తర్వాత మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగాయి. మెయిటీ మరియు కుకీ కమ్యూనిటీల మధ్య జరిగిన హింసలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎన్ బీరెన్ సింగ్‌కు విధేయులుగా ఉన్న మైతీ వర్గానికి చెందిన 28 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిసిన రోజున ప్రధాని మోదీకి ఈ మెమోరాండం సమర్పించారు. సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ (SoO) కింద కుకీ మిలిటెంట్ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read also: Parks Closed: రేపు హైదరాబాద్‌లో పార్కులు బంద్.. హెచ్ఎండీఏ అధికారులు వెల్లడి
మణిపూర్ తగలబడుతుంటే మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లడం ఏంటని ఆప్ ప్రశ్నించింది. మణిపూర్‌లో శాంతిభద్రతలు పునరుద్ధరించాలని కోరుతూ ఇంఫాల్‌లో పూర్తిగా మహిళలే నిర్వహించే ‘ఎమా కీథల్’ మార్కెట్ ప్రతినిధులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ రోడ్డులో సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోవైపు ఆర్మీతో రక్షణ కల్పించాలంటూ కుకీలు దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. తమకు రక్షణ కల్పించడంతోపాటు తమపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కుకీ వర్గం పిటిషన్ దాఖలు చేసింది.
