ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ వివాహ మండపంలోకి చిరుత పులి ప్రవేశించింది. దీంతో పెళ్లి వాళ్లు.. బంధువులు హడలెత్తిపోయారు. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోగా.. చిరుత పులి ఎలా ప్రవేశించిందో.. ఏమో తెలియదు గానీ.. పెళ్లి వాళ్లను మాత్రం హడలెత్తించింది. లక్నోలోని పారాలోని బుద్ధేశ్వర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న ఎంఎం లాన్‌లో జరిగింది. భయాందోళనకు గురైన పెళ్లి వాళ్లు పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ మరియు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత పులిని పట్టుకోవడానికి ఆపరేషన్ ప్రారంభించారు. దీంతో వారిపై కూడా అమాంతంగా దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఫారెస్ట్ అధికారి కూడా గాయపడ్డారు. వెంటనే అటవి శాఖ అధికారులు కూడా భయంతో పరుగులు తీశారు. మొత్తానికి కొన్ని గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి.. చాకచక్యంగా చిరుతపులిని బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
लखनऊ में एक शादी में तेंदुआ घुस आया… पुलिस वालों ने पकड़ने की कोशिश किया तो राइफल लेकर भाग गया…. इसमें सबसे मेहनत का काम कैमरामैन कर रहा है pic.twitter.com/a6RCi1HOyD
— Mohammad Imran (@ImranTG1) February 12, 2025