Section 498A: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్యతో పాటు ఆమె కుటుంబం వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్నారు. తాను నిర్దోషినని అయినా కూడా న్యాయవ్యవస్థ ఆమెకే అనుకూలంగా ఉందని చెబుతూ 20 పేజీల లేఖ రాయడంతో పాటు 80 నిమిషాల వీడియోలో తాను అనుభవించిన వేధింపులను చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
ఈ కేసు నేపథ్యంలో వరకట్న వేధింపులకు సంబంధించి సెక్షన్ 498A దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తక్షణ సంస్కరణలు తీసుకురావాలని పలువురు లాయర్లతో పాటు పలు సంఘాలు పిలుపునిచ్చాయి. లాయర్ అడ్వకేట్ వికాస్ పహ్వా బుధవారం ఈ సెక్షన్ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని కోరారు. మూడు దశాబ్ధాలుగా క్రిమినల్ లాయర్‌గా గుర్తింపు పొందిన పహ్వా మాట్లాడుతూ.. కొందరు వ్యక్తిగతంగా సెక్షన్ 498A దుర్వినియోగం చేయడాన్ని తాను చూశానని చెప్పారు. వరకట్న వేధింపులకు సంబంధించిన వాస్తవ ఉదంతాలు ఉన్నప్పటికీ, ఆర్థికంగా సమస్యలు పరిష్కరించాలని భర్త, అతడి కుటుంబాలపై ఒత్తిడి చేయాలనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఇలాంటి కేసుల్లో చాలా వరకు నిరాధారమైనవి ఉన్నాయని, చట్టాన్ని తప్పుగా ఉపయోగించడాన్ని నిరోధించడానికి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
Read Also: Low Fertility Rate: వారానికి 4 రోజులే పని..సంతానోత్పత్తిని పెంచేందుకు జపాన్ కీలక నిర్ణయం..
క్రిమినల్ కేసులు వాదించడంలో పేరు సంపాదించిన మరో న్యాయవాది సుమిత్ గెహ్లాట్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నిబంధనల ద్వారా భర్తనే కాకుండా మొత్తం కుటుంబాన్ని కూడా వేధించడానికి కొందరు ఆయుధంగా వాడుతున్నారని చెప్పారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా మానసిక క్షోభ, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు, కొన్ని సందర్భాల్లో విషాదకరమైన ఘటనలు ఎదురవుతున్నట్లు చెప్పారు. ఈ చట్టాన్ని బాధితుల రక్షణ కోసం, కానీ దాని దుర్వినియోగాన్ని నిరోధించడానికి భద్రతా చర్యలు తప్పనిసరి అని చెప్పారు.
అనేక సందర్భాల్లో న్యాయ వ్యవస్థ విఫలమైన వివాహాలు కేవలం విడాకులతో ముగిసే వాతావరణాన్ని సృష్టించాయని, కానీ తరచూ భర్తకు దీర్ఘకాల దుస్థితికి దారితీస్తుందని క్రిమినల్ లాయర్ ఆశిష్ దీక్షిత్ పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో భారీగా భరణం డిమాండ్ చేయడం భర్తల్ని ఆర్థికంగా కుంగదీస్తున్నట్లు వెల్లడించారు. పెళ్లయిన కొన్ని నెలలే అయిన భర్తల నుంచి విపరీతమైన భరణం డిమాండ్ చేయడంతో వారి జీవితాలను క్లిష్టతరంగా మారుతున్నాయని అన్నారు. క్రిమినల్ లాయర్ జూహీ అరోరా కూడా ఇలాంటి దుర్వినియోగాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు, సుప్రీంకోర్టు వరకట్న వేధింపుల కేసును విచారిస్తు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం.. సెక్షన్ 498A దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు.