Anmol Bishnoi: అమెరికా ఆశ్రయం కోరుతున్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు..
- అమెరికా ఆశ్రయం కోరుతున్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు..
- ఇటీవల నకిలీ పత్రాలతో యూఎస్‌లో పట్టుబడ్డ అన్మోల్ బిష్ణోయ్..
- సిద్దూమూసేవాలా, బాబా సిద్ధిక్ హత్యల్లో మోస్ట్ వాంటెడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anmol Bishnoi: ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఆశ్రయం కోరుతున్నట్లు సమచారం. భారత్‌లో జరిగిన పలు హై ప్రొఫైల్ హత్యల్లో్ అన్మోల్ బిష్ణోయ్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. బిష్ణోయ్ గల వారంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులతో అరెస్ట్ చేయబడ్డాడు. నకిలీ పత్రాలను ఉపయోగించి దేశంలోకి ప్రవేశించినందుకు బిష్ణోయ్‌ను కాలిఫోర్నియాలో యుఎస్ ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి. అతను ప్రస్తుతం అయోవాలోని పొట్టవట్టమీ కౌంటీ జైలులో ఉన్నాడు.
సోర్సెస్ ప్రకారం, అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నాడని భారత ప్రభుత్వం అందించిన వివరాలతోనే అతడి అరెస్ట్ జరిగింది. బిష్ణోయ్ అమెరికా నుంచి రప్పించేందుకు ముంబై పోలీసులు చర్యలు ప్రారంభించిన తర్వాత, అతను అమెరికాలో ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం పొందేందుకు అక్కడి అధికారులను ఆశ్రయించి ఉండొచ్చని తెలుస్తోంది. వాంటెండ్ గ్యాంగ్‌స్టర్‌ని భారత్ లేదా ఇతర దేశానికి అప్పగించే చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్మోల్ బిష్ణోయ్ చట్టపరమైన మార్గాల ద్వారా ఆశ్రయం పొందే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Also Read
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
- Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
Read Also: Earth’s Magnetic Poles: భూమి అయస్కాంత ఉత్తర ధ్రువం రష్యా వైపు కదులుతోంది.. ప్రళయం తప్పదా..?
ఇలాంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేసేందుకు అమెరికా న్యాయ వ్యవస్థ మొగ్గు చూపడంతో పాటు, గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ వంటి వారిని కూడా అమెరికా అధికారులు అరెస్ట్ చేసి, విడుదల చేశారు. ఈ పరిణామాలు చూసుకుంటే బిష్ణోయ్ భారత్‌కి అప్పగించకుండా తప్పించుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అన్మోల్ బిష్ణోయ్ 2023లో నకిలీ పాస్‌పోర్టుని ఉపయోగించి భారత దేశం నుంచి పారిపోయాడు. అతని సోదరుడు లారెన్స్ బిష్ణోయ్ అరెస్ట్ తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలకు కేంద్రంగా మారాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ముంబై ఇంటి వెలుపల జరిగిన భారీ కాల్పుల ఘటన మరియు 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యతో సహా పలు క్రిమినల్ కేసుల్లో అతడు వాంటెడ్ గా ఉన్నాడు.
ఇటీవల అక్టోబర్ నెలలో మహారాష్ట్ర మాజీ మంత్రి, రాజకీయ నాయకులు బాబా సిద్ధిక్ హత్యతో బిష్ణోయ్ గ్యాంగ్‌కి సంబంధం ఉంది. సిద్ధిక్ హత్యకు పాల్పడిన ముష్కరులతో బిష్ణోయ్ టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దాఖలు చేసిన రెండు కేసులతో పాటు మరో 18 క్రిమినల్ కేసుల్లో బిష్ణోయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జూలైలో, ముంబై కోర్టు అతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది మరియు అతనిని అరెస్టు చేయడానికి ఎవరైనా సమాచారం ఇస్తే రూ. 10 లక్షల రివార్డ్ ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది.
తాజావార్తలు
-
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
-
Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
-
Jaya Bachchan: జాన్వీని ఒక వస్తువులా చూసినట్లున్నారు.. పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు
-
Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్‌పై బుచ్చిబాబు ఎమోషనల్!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!