NTV Telugu Site icon

Anmol Bishnoi: అమెరికా ఆశ్రయం కోరుతున్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు..

Anmol Bishnoi

Anmol Bishnoi

Anmol Bishnoi: ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఆశ్రయం కోరుతున్నట్లు సమచారం. భారత్‌లో జరిగిన పలు హై ప్రొఫైల్ హత్యల్లో్ అన్మోల్ బిష్ణోయ్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. బిష్ణోయ్ గల వారంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులతో అరెస్ట్ చేయబడ్డాడు. నకిలీ పత్రాలను ఉపయోగించి దేశంలోకి ప్రవేశించినందుకు బిష్ణోయ్‌ను కాలిఫోర్నియాలో యుఎస్ ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి. అతను ప్రస్తుతం అయోవాలోని పొట్టవట్టమీ కౌంటీ జైలులో ఉన్నాడు.

సోర్సెస్ ప్రకారం, అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నాడని భారత ప్రభుత్వం అందించిన వివరాలతోనే అతడి అరెస్ట్ జరిగింది. బిష్ణోయ్ అమెరికా నుంచి రప్పించేందుకు ముంబై పోలీసులు చర్యలు ప్రారంభించిన తర్వాత, అతను అమెరికాలో ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం పొందేందుకు అక్కడి అధికారులను ఆశ్రయించి ఉండొచ్చని తెలుస్తోంది. వాంటెండ్ గ్యాంగ్‌స్టర్‌ని భారత్ లేదా ఇతర దేశానికి అప్పగించే చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్మోల్ బిష్ణోయ్ చట్టపరమైన మార్గాల ద్వారా ఆశ్రయం పొందే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Read Also: Earth’s Magnetic Poles: భూమి అయస్కాంత ఉత్తర ధ్రువం రష్యా వైపు కదులుతోంది.. ప్రళయం తప్పదా..?

ఇలాంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేసేందుకు అమెరికా న్యాయ వ్యవస్థ మొగ్గు చూపడంతో పాటు, గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ వంటి వారిని కూడా అమెరికా అధికారులు అరెస్ట్ చేసి, విడుదల చేశారు. ఈ పరిణామాలు చూసుకుంటే బిష్ణోయ్ భారత్‌కి అప్పగించకుండా తప్పించుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అన్మోల్ బిష్ణోయ్ 2023లో నకిలీ పాస్‌పోర్టుని ఉపయోగించి భారత దేశం నుంచి పారిపోయాడు. అతని సోదరుడు లారెన్స్ బిష్ణోయ్ అరెస్ట్ తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలకు కేంద్రంగా మారాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ముంబై ఇంటి వెలుపల జరిగిన భారీ కాల్పుల ఘటన మరియు 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యతో సహా పలు క్రిమినల్ కేసుల్లో అతడు వాంటెడ్ గా ఉన్నాడు.

ఇటీవల అక్టోబర్ నెలలో మహారాష్ట్ర మాజీ మంత్రి, రాజకీయ నాయకులు బాబా సిద్ధిక్ హత్యతో బిష్ణోయ్ గ్యాంగ్‌కి సంబంధం ఉంది. సిద్ధిక్ హత్యకు పాల్పడిన ముష్కరులతో బిష్ణోయ్ టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దాఖలు చేసిన రెండు కేసులతో పాటు మరో 18 క్రిమినల్ కేసుల్లో బిష్ణోయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జూలైలో, ముంబై కోర్టు అతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది మరియు అతనిని అరెస్టు చేయడానికి ఎవరైనా సమాచారం ఇస్తే రూ. 10 లక్షల రివార్డ్ ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది.

Show comments