NTV Telugu Site icon

UP Encounter: యూపీలో ఎన్‌కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ హతం..

Up Encounter

Up Encounter

UP Encounter: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరడుకట్టిన నేరస్తుడు హతమయ్యాడు. పోలీస్ ఆపరేషన్‌లో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. చనిపోయిన నిందితుడిని జీతుగా గుర్తించారు. ఇతడిపై రూ. 1 లక్ష రివార్డు ఉంది. బుధవారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్)‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇతను మరణించాడు.

Read Also: Annamalai: ‘‘ ఏంటి బ్రో ఇది’’.. పొలిటికల్ “స్టార్” విజయ్‌‌పై అన్నామలై ఆగ్రహం..

జీతు అలియాస్ జితేంద్రగా గుర్తించబడిన నేరస్తుడి కాల్పుల్లో గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మీరట్‌లోని ముండలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఎస్టీఎఫ్, నేరస్తుల ముఠాకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని అసౌంద గ్రామానికి చెందిన జీతు అనేక నేర కార్యకలాపాలలో పాల్గొన్నాడు. అతనిపై వివిధ అభియోగాల కింద ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇతడికి ఝజ్జర్ డబుల్ మర్డర్ కేసులో జీవిత ఖైదు విధించబడింది. అయితే, 2023లో పెరోల్‌పై బయటకి వచ్చి, అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.

తప్పించుకున్న తర్వాత జీతు ఘజియాబాద్‌లోని తిలామోడ్ ప్రాంతంలో ఒక హత్య చేశాడు. జైలులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో సంబంధాలు పెంచుకున్నాడు. తప్పించుకుని తిరుగుతున్న ఇతడిపై పోలీసులు రూ. 1 లక్ష రివార్డ్ ప్రకటించారు. ఫిబ్రవరి 3, 2018న అదే కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది, వేరే కేసులో పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఢిల్లీ, ఝజ్జర్, కంఝవాలా, వికాస్ పురి, యూపీలోని ఘజియాబాద్‌లో పలు నేరాల్లో ఇతడి ప్రమేయం ఉంది.