NTV Telugu Site icon

Odisha Train Tragedy : ఒడిశా రైలు ప్రమాదం.. 28 గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు

Untitled 13

Untitled 13

Odisha Train accident: మనం ప్రతి రోజు ఏదో ఒక చోటుకి ప్రయాణిస్తుంటాము. ఇంటి నుండి బయటకి వచ్చాక తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్తామనే ప్రతి ఒక్కరు అనుకుంటారు. రేపుంది అనే నమ్మకం తోనే మనిషి జీవిస్తుంటాడు. అయితే మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అలా వచ్చి ఇలా ప్రాణాలను తీసుకు వెళ్తుంది. అయితే తన వాళ్ళని చివరిసారిగా చూసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొందరికి ఆ అదృష్టం ఉండదు. అయినవాళ్ళకి చివరి చూపుకు కూడా అందదు. అందరూ ఉన్న అనాధ శవంలా మిగిలిపోతారు. మున్సిపాల్టి వాళ్ళు దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనే ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read also:Shamshabad Airport : ఎలా వస్తాయి రా ఇలాంటి ఐడియాలు.. డిటర్జెంట్ సర్ఫ్‌లో బంగారం

వివరాలలోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం లోని బాలాసోర్ జిల్లాలో నాలుగు నెలల క్రితం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ హృదయ విదారక ఘటనలో 1000 మందికి పైగా మరణించారు. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటికి 28 మృతదేహాలు ఎవరివో గుర్తించబడలేదు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించనున్నారు. కాగా ఈ విషయం పైన భువనేశ్వర్ మేయర్ సులోచన దాస్ మాట్లాడుతూ నెలలు గడుస్తున్న మృతుల వివరాలు గుర్తించబడలేదు.. ఈ నేపథ్యంలో మృతదేహాలను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది గుర్తించని 28 మృతదేహాలకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆమె తెలియచేశారు.