పెట్రోల్, డీజిల్ రేట్లు ఇష్టానుసారం పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులను దోపీడి చేస్తున్నాయని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. పెట్రోల్, డిజీల్ పై లీటర్ ధరపై కేంద్రం రూ.5, రూ.10 తగ్గించి బీజేపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. లీటర్‌పెట్రోల్‌పై రూ.50 తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే దేశ ప్రజలకు మేలు జరుగుతందని ఆయన అభిప్రాయ పడ్డారు.
అయితే యూపీలో ఎన్నికలు పూర్తవ్వగానే కేంద్రం మళ్లీ పెట్రోలు, డిజీల్ పెంచేస్తుందని లాలూ ఆరోపించారు. ఇది కేవలం రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల స్టంట్ అని ఆయన చెప్పారు. బీజేపీ కావాలనే పెట్రోలు, డిజీల్ రేట్లను అమాంతంగా పెంచుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, పెట్రోల్‌ను రూ.70 వరకు తీసుకురావాలని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ అన్నారు.
