NTV Telugu Site icon

Lalit Modi: వాలంటైన్స్ డే రోజున మరో కొత్త ప్రేయసిని పరిచయం చేసిన లలిత్ మోడీ

Lalitmodi

Lalitmodi

ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరో కొత్త ప్రేయసిని పరిచయం చేశారు. గతంలో మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ను పరిచయం చేశారు. ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్నారు. ఈ ఏడాది మరో ప్రేయసిని పరిచయం చేస్తూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ఎన్నో ఏళ్ల తమ స్నేహ బంధం ప్రేమగా మారినందుకు సంతోషంగా ఉందని నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేశారు. లలిత్ మోడీ వయసు ప్రస్తుతం 61 ఏళ్లు. ఐపీఎల్ సృష్టకర్తగా పేరు తెచ్చుకున్నారు. అయితే తాను దావుద్ ఇబ్రహీం హెచ్చరికలతో విదేశాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఇటీవల చెప్పుకొచ్చారు.

లలిత్ మోడీ మనీలాండరింగ్ కేసులో 2010లో దేశం విడిచి లండన్‌లో నివాసం ఉంటున్నారు. 2022లో సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు చెప్పడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. కానీ ఊసు లేదు.. ఆ వార్త లేదు. ఇంతలోనే మరో కొత్త ప్రేమికురాలిని లైన్‌లోకి తీసుకొచ్చారు. ఈమెతోనైనా ఉంటారా? లేదంటే మళ్లీ వచ్చే ప్రేమికుల రోజున ఇంకో ప్రేయసిని పరిచయం చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే లలిత్ మోడీ సతీమణి మిలాన్‌ మోడీ 2018లో క్యాన్సర్‌తో చనిపోయారు.