Site icon NTV Telugu

Ladakh Violence: లడఖ్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ నేత హస్తం! ఫొటోలు బయటపెట్టిన బీజేపీ

Ladakh Violence1

Ladakh Violence1

లడఖ్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ కౌన్సిలర్ ఫుంటోగ్ స్టాన్జిన్ త్సెపాగ్ హస్తం ఉన్నట్లుగా బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా ఎక్స్‌లో ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. రాహుల్‌గాంధీ ఇలాంటి అశాంతిని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కౌన్సిలర్.. బీజేపీ కార్యాలయం, వాహనాలు తగలబెట్టాలని ప్రేరేపించారని బీజేపీ ఆరోపించింది.

ఇది కూడా చదవండి: Trump: నేడు ట్రంప్‌తో షెహజాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ భేటీ.. నిశితంగా పరిశీలిస్తున్న భారత్

అయితే ఈ ఆరోపణలను వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఖండించారు. కాంగ్రెస్‌కు ఇక్కడ అంత సీన్ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభావం లేదని తెలిపారు. ఇక లేహ్‌లో జరిగిన సంఘటనలు చాలా బాధగా ఉందన్నారు. శాంతియుత మార్గం గురించి తన సందేశం విఫలమైందని వాపోయారు. ఇలాంటి అల్లర్లు ఆపాలని యువతకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Ladakh Violence: లడఖ్ హింస‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి.. కీలక సమాచారం సేకరణ!

భారత్‌లో ఇప్పటిదాకా ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ బుధవారం హఠాత్తుగా లడఖ్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రాష్ట్ర హోదా పేరుతో నిరసనకారులు రోడ్లపైకి నానా బీభత్సం సృష్టించారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వి.. వాహనాలు తగలబెట్టారు. అంతటితో ఆగకుండా బీజేపీ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలపై దాడి చేసి తగలబెట్టారు. దీంతో నేపాల్‌లో మాదిరిగా జెన్-జెడ్ తరహాలో హింస చెలరేగింది. ఒక్కసారిగా కేంద్రం అప్రమత్తం అయింది. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా బుధవారం కేంద్ర భూభాగంలోని లేహ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధించారు. దీంతో భారీగా భద్రతా దళాలు మోహరింపు హింస చెలరేగకుండా ఆపగలిగారు.

ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరసన దీక్ష చేస్తున్నాడు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సోనమ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లుగా కేంద్రం గుర్తించింది. కొన్ని గుంపులను హింస ప్రేరేపించినట్లుగా అనుమానిస్తోంది. లడఖ్‌కు రాష్ట్ర హోదా కోసం అరబ్ స్ప్రింగ్ తరహా ఉద్యమాన్ని కోరుకుంటున్నట్లు సోనమ్ ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా నేపాల్‌లో జరిగిన జెన్-జెడ్ ఉద్యమాన్ని కూడా పదే పదే ప్రస్తావించడంతో బుధవారం హఠాత్తుగా హింస చెలరేగినట్లుగా కేంద్రం భావిస్తోంది. సోనమ్.. అరబ్ స్ప్రింగ్ తరహా నిరసన, నేపాల్‌లో జనరల్ జెడ్ నిరసనల తరహా రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించాడని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇక బుధవారం జరిగిన హింసలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 70 మంది గాయపడ్డారు. లడఖ్‌లో పరిస్థితి దానంతట అదే అదుపు తప్పలేదని.. ఉద్దేశపూర్వకంగా దీనిని సృష్టించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టడం వల్లే ఇదంతా జరిగిందని పేర్కొంది. సోనమ్ వాంగ్‌చుక్ వ్యక్తిగత ఆశయాలకు లడఖ్, యువ జనాభా భారీ మూల్యం చెల్లిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కుట్రలో చిక్కుకున్నందుకు వారిని నిందించలేమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లడఖ్ ప్రజల సంక్షేమం, సాధికారతకు కేంద్రం కట్టుబడి ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Exit mobile version