NTV Telugu Site icon

KTR: ఢిల్లీ పర్యటనలో కేటీఆర్‌.. ఇటీవల అనారోగ్యానికి గురయిన కవితతో ములాఖాత్..

Ktr Kavitha

Ktr Kavitha

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితను కేటీఆర్ కలవనున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్నారు. కాగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా కేటీఆర్ ఇవాళ కవితతో భేటీ కానున్నారు. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో కవిత ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ఆరా తీయనున్నారు. మరోవైపు కవితకు కొద్దిరోజుల క్రితం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Read also: Coal Production: ఓపేన్ కాస్ట్ లోకి చేరిన భారీగా వర్షపు నీరు.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక తాజాగా ఆమెకు వైద్య పరీక్షలు చేయాలని జైలు అధికారులకు ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం సూచించింది. పరీక్షలు అనంతరం నివేదికను అందించాలని ధర్మాసనం పేర్కొంది. ఇక లిక్కర్ కేసులో భాగంగా సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈనెల 22 వరకు ట్రయల్ కోర్టు పొడిగించింది. గతంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను జైలు అధికారులు కోర్టుకు హాజరు పరిచారు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు, పరీక్ష ఫలితాల్లో వ్యత్యాసాలను న్యాయమూర్తి దృష్టికి కవిత తీసుకొచ్చారు. ప్రైవేటు ఆస్పత్రిలో చెకప్ కోసం కవిత లాయర్లు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కవిత తన మనవిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలే అస్వస్థత కారణంగా దీన్ దయాళ్ ఆస్పత్రిలో కవితకు పరీక్షలు నిర్వహించారు. కవిత పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు చేయించాలని అధికారులకు ఆదేశించింది.
CM Chandrababu: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష