NTV Telugu Site icon

KSRTC : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాట్‌ ఏ ఐడియా సర్‌జీ..!

Ksrtc

Ksrtc

కాలం చెల్లిన్న బస్సులను పక్కన పడేస్తారు.. ఇది అందరికీ తెలిసిన విషయం.. ఎందుకంటే ఫిట్‌నెస్‌ లేని బస్సులు రోడ్లపైకి అనుమతిస్తే.. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అయితే ఇలా.. కాలం చెల్లిన బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేరళ ప్రభుతం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదేటంటే.. కాలం చెల్లిన బస్సులను తరగతి గదులుగా ఆధునీకరించి అందుబాటులోక తీసుకురావడం. అవునండీ.. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర శాఖ మంత్రి ఆంటోని రాజు ధృవీకరించారు కూడా..

కేర‌ళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ ప‌రిధిలో కాలం చెల్లిన బ‌స్సుల‌ను తుక్కు చేయ‌డం కంటే త‌ర‌గ‌తి గ‌దులుగా వినియోగిస్తే బాగుంటుంద‌ని ఆలోచ‌న వ‌చ్చింద‌న్నారు అంటోని.  లో ఫ్లోర్ బ‌స్సుల‌న్నింటినీ క్లాస్ రూమ్‌లుగా మార్చ‌డంతో పిల్ల‌ల‌కు కూడా కొత్త అనుభూతి క‌లుగుతుంద‌న్న అంటోని.. మొద‌ట‌గా రెండులో ఫ్లోర్ బ‌స్సుల‌ను కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలోని ప్ర‌భుత్వ స్కూల్లో ఏర్పాటు చేస్తామ‌ని వెల్లడించారు. అనంత‌రం అన్ని పాఠ‌శాల‌ల‌కు విస్త‌రిస్తామ‌ని, మొత్తం 400 బ‌స్సులను త‌ర‌గ‌తి గ‌దులుగా ఆధునీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.