NTV Telugu Site icon

Shivraj Patil: కృష్ణుడు, అర్జునుడికి “జీహాద్” గురించి చెప్పాడు..

Shivpal Patil

Shivpal Patil

‘‘Krishna Also Talks Of Jihad To Arjun’’- Congress leader’s controversial comments: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్, కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. జీహాద్ అనే భావన కేవలం ఇస్లాం మతంలోనే కాదు.. భగవద్గీత, క్రైస్తవంలో కూడా ఉందని వ్యాఖ్యానించారు. పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మొహసినా కిద్వాయ్ జీవిత చరిత్రను ఆవిష్కరించే సందర్భంగా పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Prince Movie: ప్రిన్స్ కు ‘జాతిరత్నాలు’ వైబ్స్.. ప్రేక్షకుల ట్విట్టర్ టాక్

ఇస్లాం మతంలో జీహాద్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని..సరైన ఉద్దేశాలను కలిగి ఉండీ, సరైన పని చేస్తున్నప్పటికీ.. ఎవరూ దీన్ని అర్థం చేసుకోవడం లేదని ఆయన అన్నారు. ఇది ఖురాన్ లోనే కాదు.. మహాభారతంలో కూడా, గీతలో కూడా భాగంగా ఉందని.. కృష్ణుడు, అర్జునుడికి జీహాద్ గురించి చెప్పాడని.. ఆయన అన్నారు. మీ మతాన్ని అనుసరిస్తూనే అన్ని మతాలను గౌరవించాలని మొహిసిదా కిద్వాయ్ పుస్తకం చెబుతుందని పాటిల్ అన్నారు.

పాటిల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది బీజేపీ. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా దీనిపై స్పందిస్తూ.. ఆప్ కి చెందిన గోపాల్ ఇటాలియా, రాజేంద్ర పాల్ తర్వాత హిందూ ద్వేషం, ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉండకూడదని శ్రీకృష్ణుడు ‘జీహాద్’ నేర్పించారని కాంగ్రెస్ నేత శివపాల్ పాటిల్ అన్నారని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ హిందూ, కాషాయ బీభత్సాన్ని సృష్టించింది.. రామ మందిరాన్ని వ్యతిరేకించిందని.. రాముడి అస్థిత్వాన్ని ప్రశ్నించిందని.. హిందుత్వను ఐఎస్ఎస్ తో పోల్చిందని పూనావాలా ట్వీట్ లో ఆరోపించారు. శివపాల్ పాటిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేకు ఓటేసినట్లు వెల్లడించారు. అయితే పొరపాటున ఖర్గేను ఖండేల్ వాల్ అని రెండుసార్లు తప్పుగా ప్రస్తావించారు.