Prince Movie: ప్రిన్స్ కు ‘జాతిరత్నాలు’ వైబ్స్.. ప్రేక్షకుల ట్విట్టర్ టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prince Movie: కొంతమంది తమిళ హీరోలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అలాంటి హీరోల్లో శివ కార్తికేయన్ ఒకరు. గతంలో ఆయన నటించిన రెమో, సీమరాజా, వరుణ్ డాక్టర్, డాన్ వంటి చిత్రాలు తెలుగులో మంచి వసూళ్లు సాధించాయి. ఆ ఉత్సాహంతోనే కార్తికేయన్ తెలుగులో నేరుగా ప్రిన్స్ గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జాతిరత్నాలు సినిమాతో మంచి విజయం అందుకున్న అనుదీప్ ప్రిన్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా అవుట్ అండ్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమాలో మారియా ర్యాబోషప్క అనే విదేశీ నటి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత, థమన్ సంగీతం అందించాడు.
Read Also: Karthi Sardar Movie: సర్దార్ సినిమా ఇలా ఉంటుందనుకోలేదు.. ట్విట్టర్ టాక్
ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. పాండిచ్చేరిలో జరిగిన ఒక తమిళ అబ్బాయి, ఇంగ్లిష్ అమ్మాయి ప్రేమకథే ఈ సినిమా. ప్రిన్స్’ సినిమా యూఎస్ ప్రీమియర్స్, తమిళనాడులో స్పెషల్ షోలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా ఈ సినిమా పై తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.
Also Read
‘ప్రిన్స్’ మూవీని చూసిన తమిళ ప్రేక్షకులు దర్శకుడు అనుదీప్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ‘జాతిరత్నాలు వైబ్స్ 80 శాతం ఉన్నాయి. అనుదీప్ ట్రీట్‌మెంట్ వర్కౌట్ అయింది. సెకెండాఫ్‌లో 20 నిమిషాలు స్లోగా ఉన్నా అనుదీప్ వల్ల డీసెంట్ ఫిల్మ్‌గా మారిపోయింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read Also: Ori Devuda: క్లాసీ ఎలిమెంట్స్‌తో విశ్వక్ సేన్ కామెడీ.. ‘ఓరి దేవుడా’ ట్విట్టర్ రివ్యూ
#PrinceReview 1st half: A neat packaged entertainer from #Anudeep & #Sivakarthikeyan. Comedy portions worked very well. BGM & SONGS huge plus. #SK's screen presence is an absolute delight. #Sathyaraj's performance is a huge bonus. 1st half was a breezy ride.#Prince #PrinceFDFS pic.twitter.com/nySdrdtddV
— Being Filmy (@beingfilmy_) October 21, 2022
#Prince
1st Half
Such a cool intro card for #Sivakarthikeyan 👌#Jessica #BimbilikkiPilapi dance👏#Anudeep brand of comedy 😉
Most one liners Working well
Bottleguard Gummuru Tapparu 😅#Maria looks and her Tamil is cute ❤️Silly as well as entertaining so far
As expected ✌️— Raaja (@raajaboss) October 21, 2022
#Prince First Half Super 👌
Comedy Scenes Semma 🤩 pic.twitter.com/qTNSJ9b1aB
— ✯ 𝚂𝚊𝚝𝚑𝚎𝚜𝚑𝙺𝚞𝚖𝚊𝚛.𝙱 ✯ (@SatheshK_AK) October 21, 2022
తాజావార్తలు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!