NTV Telugu Site icon

సంచలనం సృష్టించిన కొల్లం కేసు.. అసలు దోషిని తేల్చిన కోర్టు..

కేరళలోని కొల్లంలో దివ్యాంగురాలైన ఓ వివాహిత పాటు కాటుతో మరణించింది.. అయితే, అదంతా ఓ ప్లాన్‌ ప్రకారం చేసిన మర్డర్‌ కావడం అంతా కంగుతినే విషయం.. ఈ కేసును సవాల్‌గా తీసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. సజీవ పాము, ఓ బొమ్మ దాని చేతిని ఉపయోగించి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయడం సంచలంగా మారింది.. ఈ తరహాలో పోలీసులు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.. దీంతో.. ఇది దేశవ్యాప్తంగా సంచనలంగా మారింది.. అయితే, ఈ కేసులో మృతురాలి భర్తను దోషిగా నిర్ధారించింది కొల్లం అడిషనల్‌ సెషన్‌ కోర్టు..

కాగా, గత ఏడాది వరకట్న వేధింపులకు గురై వివాహిత మహిళ మృతిచెందింది.. గత మే 7, 2020న కొట్టరక్కాకు చెందిన ఉత్తర అనే దివ్యాంగురాలైన వివాహిత పాటు కాటుతో మరణించారు.. పాము కాటుతో తన భార్య మృతి చెందిందని అందరనీ నమ్మించే ప్రయత్నం చేశాడు భర్త సూరజ్… కానీ, ఉత్తర మరణంపై తల్లిదండ్రులకు అనుమానం వచ్చి కేసు నమోదు చేయగా ఆస్తి కోసం ఆమెను పెళ్లాడిన భర్త సూరజ్‌ పకడ్బందీగా ప్లాన్‌ చేసి చంపినట్లుగా పోలీసుల విచారణలో బయట పడింది.. ఈ క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేసిన కేరళ పోలీసు బృందం సజీవ పాము, డమ్మీ బోమ్మను దాని చేతిని ఉపయోగించి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు చేశారు.. కొల్లం జిల్లాలోని అరిప్పలో అటవీ శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర శిక్షణా కేంద్రంలో పోలీసుల సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ జరిగింది.. వీడియోలతో, పక్యా ఆధారాలను కోర్డు ముందు ఉంచారు పోలీసులు.. సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు.. భర్త సూరజ్ ను దోషిగా ప్రకటించింది.. కేసును సరికొత్త ఆలోచనతో ఛేదించిన పోలీసులకు కోర్టు అభినందనలు తెలిపింది.