NTV Telugu Site icon

Polygraph Test: కోల్‌క‌తా మెడికో హ‌త్యాచార నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్.. ఏం చెప్పాడంటే..?

Kolkata

Kolkata

Polygraph Test: కోల్‌క‌తాలో ఆర్‌జీ కార్ హస్పటల్ జూనియర్ డాక్టర్ ని హ‌త్యాచారం చేసిన కేసులో.. ప్రధాన నిందితుడు సంజ‌య్ రాయ్‌కి ఆదివారం పాలీగ్రాఫ్ టెస్ట్ చేశారు. కోల్‌క‌తా పోలీసు శాఖ‌లో సివిల్ వాలంటీర్‌గా అత‌ను వర్క్ చేస్తున్నాడు. అయితే, సీబీఐకి ఇచ్చిన‌ లై డిటెక్టర్ పరీక్షలో నిందితుడు సంజ‌య్ కొన్ని కీల‌క అంశాలు వెల్లడించినట్లు తెలుస్తుంది. నేరం జ‌రిగిన రోజు రాత్రి జ‌రిగిన ప‌రిణామాల‌ను పేర్కొన్నాడు. ఆ రోజు రెండు రెడ్‌లైట్ ఏరియాల్లో తిరిగిన‌ట్లు అత‌ను చెప్పాడు. కానీ శృంగారంలో పాల్గొన‌లేద‌ని తెలిపాడు. ఓ వీధిలో ఓ మ‌హిళ‌ను వేధించిన‌ట్లు పాలీగ్రాఫ్ టెస్టులో సంజయ్ రాయ్ ఒప్పుకున్నాడు. ఈ ఘ‌ట‌న నిఘా కెమెరాల‌కు కూడా దొరికింది. ఆ రోజునే త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడిన‌ట్లు కూడా సంజయ్ చెప్పాడు. ఆమె న‌గ్న ఫోటోల కోసం సంజ‌య్ అడిన‌ట్లు వెల్లడైంది.

Read Also: Jammu Kashmir : జమ్మూలో44 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

అలాగే, తాను చూసే సరికే లేడీ డాక్టర్ మరణించిందని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ చెప్పినట్లు తెలుస్తుంది. సెమినార్ హాల్లోకి వెళ్లే సరికి మృతదేహం కనిపించిందని.. మృతదేహం కనిపంచడంతో భయంతో అక్కడి నుంచి పారిపోయానని అతడు పేర్కొన్నాడు. దంతో సీబీఐ, సెంట్రల్ ఫోరెన్సిక్ టీమ్ లకు చెందిన అధికారులు అనేక ఆధారాలు చూపించి ప్రశ్నించారు.. హత్యాచారం జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నానన్న నిందితుడు చెప్పినట్లు తెలిపారు. ఇక, లై డిటెక్టర్ టెస్టులోనూ నిందితుడు సంజయ్ రాయ్ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సీబీఐ ఆరోపిస్తుంది.