NTV Telugu Site icon

Kolkata Doctor Case: “అరుణా షాన్‌బాగ్ నుంచి కోల్‌కతా డాక్టర్ వరకు”.. 50 ఏళ్ల తర్వాత అదే తరహా హత్యాచారం..

Aruna Shanbaug, Kolkata Doctor Case

Aruna Shanbaug, Kolkata Doctor Case

Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. ఈ ఒక్క ఘటనే కాదు ఆస్పత్రులు వేదికగా జరిగిన మూడు అత్యాచార ఘటనలు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురించేంది. ముంబైలో 1973లో జరిగిన ‘‘అరుణా షాన్‌బాగ్’’ ఘటన ఇందులో మొదటి ఈ ఘటన జరిగి 50 ఏళ్లు గడిచినా కూడా ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. 50 ఏళ్ల తర్వాత ఇదే తీరుగా కోల్‌కతా పీజీ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది.

Read Also: Kolkata Doctor case: వెలుగులోకి సందీప్ ఘోష్ క్రూరత్వం.. బాలింత భార్యను కడుపుపై తన్నిన మాజీ ప్రిన్సిపాల్

అరుణా షాన్‌బాగ్ కేసు:

1973లో జరిగిన అరుణా షాన్‌బాగ్ కేసు దేశాన్ని నివ్వెరపరిచింది. 25 ఏళ్ల నర్స్ మరికొన్ని రోజుల్లో తాను ప్రేమించిన న్యూరో సర్జన్‌ని పెళ్లి చేసుకునే ముందే ఆమెపై అఘాయిత్యం జరిగింది. వీరిద్దరు కూడా తమ జీవితం కోసం ఎన్నో కలలు కన్నారు. అయితే, ఆమె జీవితాన్ని వార్డ్ బాయ్, స్వీపర్‌గా పనిచేసే సోహన్ లాల్ వాల్మీకి నాశనం చేశాడు.

గోవాకు దక్షిణంగా ఉన్న ఒక కర్ణాటక పట్టణం నుంచి 17 ఏళ్ల వయసులో నర్సింగ్ చేసేందుకు ముంబై వచ్చింది. 25 ఏళ్ల వయసులో తాను ప్రేమిస్తున్న డాక్టర్‌తో కలిసి త్వరలోనే క్లీనిక్ ఓపెన్ చేయాలని భావించింది. అయితే, ఆమె సోహాల్‌లాల్ వాల్మీకిపై దొంగతనం, సరిగా పనిచేయడం లేదని చేసిన ఫిర్యాదు ఆమెని 40 ఏళ్ల పాటు జీవచ్ఛవంగా మార్చింది.

1973, నవంబర్ 27న కేఈఎం హాస్పిటల్‌లో అరుణా నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో, వాల్మీకి దాడి చేసి, కుక్క గొలుసుతో ఆమె గొంతును బిగించి, ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గొంతు బిగుసుకుపోవడంతో ఆమె మెదడుకు రక్తస్రావం నిలిచిపోయి బ్రెయిన్ డెడ్‌గా మారింది. 42 ఏళ్లు జీవచ్ఛవం, ఎలాంటి కదలికలు, మాటలు లేకుండా ఉంది. 2015లో మరణించింది. ఈ దారుణానికి ఒడిగట్టిన వాల్మీకి 1980లో జైలు నుంచి విడుదలయ్యాడు.

Read Also: Kolkata Doctor Case: సీఎం మమతా బెనర్జీ.. న్యాయం చేయాల్సిందిపోయి, న్యాయం కోసం రోడెక్కింది.. ఇదే విచిత్రం..

ఢిల్లీ నర్సు విషాదం:

సెప్టెంబర్ 6, 2003లో రాజధానిలో ఉన్న శాంతి ముకుంద్ ఆస్పత్రిలో కోమాలో ఉన్న ఒక రోగిని చూసుకుంటున్న నర్సుపై భూరా అనే వార్డ్ బాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఎదుగుతిరగడంతో అతను ఆమె కుడికంటిని తీసేశాడు. ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత బాత్రూంలోకి లాక్కెళ్లాడు. ఉదయం వరకు తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితి ఆమె కనిపించింది.

ఈ కేసులో శాంతి ముకుంద్ ఆస్పత్రి ఆమెకు చికిత్స చేయలేకపోగా, ఆమెని గురు తేజ్ బహదూర్ హస్పిటల్‌కి రిఫర్ చేశారు. ఒక పెద్ద ఆస్ప్తరిలో 3 రోజులు ఆమెకు చికిత్స అందలేకపోవడం ఇక్కడ విషాదం. చికిత్స ఆలస్యం కావడంతో ఆమె కంటి చూపుకోల్పోయింది. కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఈ కేసులో ఏప్రిల్ 2005లో భురాకు జీవిత ఖైదు పడింది. 2006లో బాధితురాలికి శాంతి ముకుంద్ ఆస్పత్రి రూ. 5.5 లక్షల చెల్లించాలని, GTB హాస్పిటల్ మరియు ఢిల్లీ ప్రభుత్వం ఆమెకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు పరిహారంగా చెల్లించాలని కోర్టులు ఆదేశించాయి.

Read Also: Kolkata Doctor Case: కోల్‌కతా ఆస్పత్రి విధ్వంసం గురించి పోలీసులకు తెలియదా..? ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్..

కోల్‌కతా డాక్టర్ కేసు:

అరుణా షాన్ బాగ్ ఘటన జరిగిన 50 ఏళ్ల తర్వాత కూడా మన ఆస్పత్రులు నర్సులకు, మహిళా డాక్టర్లకు సురక్షితంగా లేవని తెలియజేస్తోంది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై సంజయ్ రాయ్ అనే వ్యక్తి దారుణంగా అత్యాచారం, హత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఘటన జరిగిన ఆర్జీ కర్ ఆస్పత్రి పరిపాలన, కోల్‌కతా పోలీసులు, బెంగాల్ ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేసును సీబీఐకి అప్పగించింది.

పోస్టుమార్టం నివేదికలో ఆమె పెదవులు, చేతి, గొంతు, తలకు గాయాలు ఉన్నట్లుగా తేలింది. ఇదే కాకుండా నోరు, ముక్కు, ప్రైవేట్ పార్టు నుంచి రక్తస్రావం అయింది. ఆమె మెడ ఎముక విరిగిపోయింది. దీనిని బట్టి చూస్తే ఎంత నరకం అనుభవించిందనేది స్పష్టమవుతుంది. మరికొన్ని నెలల్లో పీజీ పూర్తి చేసి చెస్ట్ స్పెషలిస్ట్ అవుతామనుకున్న 31 ఏళ్ల వైద్యురాలి ఆశలు సమాధి అయ్యాయి.

ఈ కేసులో అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మరింత ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులకు బాధ్యుడిగా ఉన్న మెడిసిన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వైద్యురాలి కుటుంబానికి ఫోన్ చేసి ‘‘మీ కూతురు ఆత్మహత్య చేసుకుంది’’ అని చెప్పడం, ఆమె మృతదేహాన్ని చూసేందుకు తల్లిదండ్రుల్ని 3 గంటల వరకు అనుమతించకపోవడం ఎవరినో కాపాడాలనే ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయని సాధారణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సుదీప్ ఘోష్ వైద్యులందరికి సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి కూడా సానుభూతి చూపలేదని కోల్‌కతా హైకోర్టు పేర్కొంది. మీరు అతడిని ఎందుకు కాపాడుతున్నారు..? అని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.