భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కోల్‌కతా నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు అమర్చినట్లు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో విమానం వెంటనే టేకాఫ్ అయింది. అప్రమత్తమైన అధికారులు.. ప్రయాణికులు, లగేజీని కిందికి దించేశారు. అనంతరం విమానాన్ని తనిఖీ చేయగా.. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌లో భారీ నష్టం జరిగింది. అప్పటి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. ఇలాంటి బెదిరింపులు రావడం ఇది రెండోసారి. ఛండీగఢ్ నుంచి ముంబై వస్తున్న ఇండిగో విమానంలో బాంబు అమర్చినట్లు మే 6న ముంబై ఎయిర్‌పోర్టుకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అనంతరం ఇది బూటకమని తేలింది. మరోసారి మంగళవారం కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు ఫోన్ కాల్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అత్యవసర ప్రకటన చేసి.. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. బాంబు నిర్వీర్య బృందాలు, ఇతర రక్షణ బృందాలు ఎయిర్‌పోర్టులో అణువణువూ గాలించారు. విమానాశ్రయం దగ్గర సీఐఎస్‌ఎఫ్ బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. తనిఖీల్లో బూటకమని తేలింది.
ఇది కూడా చదవండి: PM Modi: వాయుసేనను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించిన మోడీ
