TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా

  • మమతా బెనర్జీకి మరో షాక్..
  • రాజ్యసభ సభ్యత్వానికి కోయెల్ మల్లిక్ రాజీనామా..
Koel Mullick

Koel Mullick

TMC Crisis: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరో రాజకీయ ఎదురుదెబ్బ తాకింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తాజాగా ప్రముఖ బెంగాలీ నటి కోయెల్ మల్లిక్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె టీఎంసీ తరుఫున నాలుగు నెలల క్రితమే రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇంత తక్కువ సమయంలో పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ చర్చ మొదలైంది.

రెండు రోజుల క్రితం ఆ పార్టీ సీనియర్ నేత మదన్ మిత్రా కూడా పార్టీకి గుడ్ బై చెప్పి రెబల్ వర్గంలో చేశారు. ఇప్పుడు కోయెల్ మల్లిక్ కూడా తన పదవికి రాజీనామా చేయడం మమతకు పెద్ద షాక్‌గా చెప్పవచ్చు. ఇప్పటికే టీఎంసీ రాజ్యసభ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాశ్ చిక్ బారాయిక్ తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రముఖ నటుడు రంజిత్ మల్లిక్ కుమార్తె అయిన కోయెల్ మల్లిక్, బెంగాలీ చిత్రసీమలో రెండు దశాబ్దాలుగా ప్రముఖ నటిగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, ఆమె రాజీనామాకు గల కారణాలను వెల్లడించలేదు.