Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
- కొచ్చి విమానాశ్రయంలో తీవ్ర భయాందోళనలు
- గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం
- ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో తీవ్ర భయాందోళనలు ఏర్పడ్డాయి. ఓ ప్రయాణికుడు సృష్టించిన హంగామాతో సహా ప్రయాణికులు హడలెత్తిపోయారు. విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో అందరూ కంగారు పడిపోయారు. సిబ్బంది అడ్డుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా విమానంలో తీవ్ర గందరగోళం నెలకొన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కౌలాలంపూర్ నుంచి కొచ్చికి వస్తున్న బాటిక్ ఎయిర్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని తోటి ప్రయాణికులు, సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానం సురక్షితంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావడంతో అతడిని అరెస్టు చేశారు.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్టైన వ్యక్తిని కేరళలోని పాలక్కాడ్ జిల్లా కూతనాడ్కు చెందిన 34 ఏళ్ల జంషీర్ అథనికల్గా గుర్తించారు. అతడు విమానంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు పక్కనే ఉన్న విండో సీటులో కూర్చున్నాడు. విమానం కొచ్చి వైపు తుది దశలో దిగుతున్న సమయంలో జంషీర్ ఒక్కసారిగా తన సీటు నుంచి లేచాడు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటికీపై కొట్టడంతో పాటు ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన క్యాబిన్ సిబ్బంది, తోటి ప్రయాణికులను కూడా బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు, విమాన సిబ్బంది కలిసి అతడిని బలవంతంగా అదుపులోకి తీసుకుని కట్టడి చేశారు. విమానం రాత్రి సుమారు 11.30 గంటలకు కోచిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యే వరకు అతడిని అదుపులోనే ఉంచారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే బాటిక్ ఎయిర్ భద్రతా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐఎస్ఎఫ్ అధికారులు జంషీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని నెడుంబస్సేరి పోలీసులకు అప్పగించారు. విమానం దెబ్బతీసేందుకు ప్రయత్నించడం, క్రిమినల్ ఇంటిమిడేషన్ (బెదిరింపులు), చట్టబద్ధమైన ఆదేశాలను పాటించకపోవడం వంటి ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతడు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను తెరిచేందుకు ఎందుకు ప్రయత్నించాడనే విషయంపై స్పష్టత రాలేదు. ఘటన వెనుక ఉద్దేశాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను పరిశీలించినట్లు సమాచారం. అందులో క్రిమినల్ ఇంటిమిడేషన్, అధికారుల ఆదేశాలను పాటించకపోవడం వంటి అభియోగాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఉగ్రవాదం లేదా విమానయాన భద్రతకు సంబంధించిన చట్టవిరుద్ధ చర్యలకు సంబంధించిన నిబంధనలను పోలీసులు నమోదు చేయలేదు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!