Monkeypox: భయాందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

Monkeypox Virus

Monkeypox Virus

Monkeypox: మంకీపాక్స్‌ కేసులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. దేశంలో కూడా మంకీపాక్స్ రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే 8 మంది మంకీపాక్స్ బారినపడగా.. ఓ వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయాడు. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం మంకీపాక్స్‌పై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కూడా ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని సూచనలు కూడా చేసింది. వ్యాధి వ్యాప్తి నివారణకు చేయాల్సినవి, చేయకూడనివి అంటూ పలు సూచనలు చేసింది. మంకీపాక్స్ బాధితులతో సన్నిహితంగా ఉన్న వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలని.. వ్యాధి బారిన పడకుండా ఉండేందురు ఏం చేయాలో.. చేయకూడదో తెలుసుకుందామంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ట్విట్టర్‌లో తెలిపింది.

Dollars: అప్పడాల మాటున అమెరికా డాలర్లు..!

కేంద్రం చేసిన సూచనలు: మంకీపాక్స్ వ్యాధి సోకిన బాధితులను ఇతరులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంచండి. శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గేంతవరకు బాధితులు ఐసోలేషన్‌లో ఉండాలి. బాధితులు మూడు లేయర్ల మాస్క్‌ ధరించాలి. దద్దుర్లు బయటి గాలికి తగలకుండా చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. సమీపంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ధరించాలి. ఆ తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. లేదా శానిటైజర్‌ రాసుకోవాలి. మంకీపాక్స్ బాధితులు ఉన్న ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మంకీపాక్స్‌ బాధితులు ఉపయోగించే దుస్తులు, టవళ్లు, పడకను కుటుంబంలో ఇతరులు వాడకూడదు. బాధితులు ఉపయోగించిన దుస్తులను మిగతా వారి దుస్తులతో కలిపి ఉతకకూడదు. వాటిని ప్రత్యేకంగా శుభ్రం చేయాలి. మంకీపాక్స్ లక్షణాలు కన్పిస్తే బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదు. తప్పుడు సమాచారం నమ్మి బాధితులపై వివక్ష చూపకూడదు.