Annamalai: కేంద్ర బడ్జెట్‌పై నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ చేసిన విమర్శలకు, తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక విధానాలు ఎలా రూపొందించబడతాయనే ప్రాథమిక అవగాహన ఆయనకు లేదని ఆరోపించారు. విజయ్ బడ్జెట్‌ని ఉద్దేశించి విమర్శి్స్తూ.. తమిళనాడుని బడ్జెట్‌లో పట్టించుకోలేదని, జీఎస్టీ తగ్గింపు గురించి ఎలాంటి ప్రస్తావన లేదని ఆరోపించారు.
Read Also: Indians deported: రెండో విడత భారతీయుల బహిష్కరణ.. శనివారం యూఎస్ నుంచి విమానం..
దీనిపై అన్నామలై తీవ్రంగా స్పందిస్తూ.. జీఎస్టీ సవరణ కేంద్ర బడ్జెట్ పరిధిలోకి రాదని, ST కౌన్సిల్ నిర్ణయిస్తుందని చెప్పారు. ‘‘మీరు ఇద్దరు సలహాదారుల్ని ఉంచుకున్నారు, జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి, బడ్జెట్‌కి మధ్య వ్యత్యాసాన్ని సరిగ్గా చెప్పమని అడగండి’’ అని అన్నామలై ఎగతాళి చేశారు. పాలన గురించి ప్రాథమిక జ్ఞానం లేని నాయకులు తమిళనాడులో మార్పు తీసుకువస్తామని చెప్పుకుంటున్నారని పేర్కొంటూ, నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు.
కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపుల్ని ఇచ్చారని, వాటిని స్వాగతించే లక్షణాలు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ, తమిళనాడును మళ్ళీ విస్మరించారని, పేదలకు ఉపశమనం కలిగించే పెట్రోల్/డీజిల్ పన్ను తగ్గింపు, GST పన్ను తగ్గింపు/సరళీకరణపై ఎటువంటి ప్రకటన లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని విజయ్ అన్నారు. ఆదాయపన్ను మినహాయింపు మధ్యతరగతి వారికి గణనీయమైన ఉపశమనం కలిగించిందని విజయ్ అన్నారు. 5 లక్షల మంది మహిళలు, ఎస్సీ/ ఎస్టీ మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారడానికి రూ. 2 కోట్ల వరకు టర్మ్ రుణాలను అందించే లక్ష్యంతో ప్రారంభించిన కొత్త పథకాన్ని ఆయన ప్రశంసించారు. అదే సమయంలో ద్రవ్యోల్బణ నియంత్రణ, ఉపాధి అవకాశాల గురించి ప్రకటన లేకపోవడం నిరాశ పరిచినట్లు చెప్పారు.