NTV Telugu Site icon

Kishan Reddy: తెలంగాణ రిపబ్లిక్ డే వివాదం.. కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఫైర్

Kishan Reddy On Kcr

Kishan Reddy On Kcr

Kishan Reddy Reacts On Telangana Republic Day Controversy: తెలంగాణ రిపబ్లిక్ డే వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్‌కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని నిప్పులు చెరిగారు. రిపబ్లిక్ డే వేడుకలను సైతం రద్దు చేసే పరిస్థితికి చేరుకున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యతిరేకంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా పరేడ్ గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు జరపడం ఆనవాయితీగా వస్తోందని.. అన్ని రాష్ట్రాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు. రిపబ్లిక్ డే వేడుకలు గవర్నర్ జరపకుండా కేసీఆర్ సర్కార్ అడ్డుపడుతోందని వ్యాఖ్యానించారు. అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానపరిచారని ఫైర్ అయ్యారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ డుమ్మా కొడుతున్నారని.. రాష్ట్రపతి సహా గవర్నర్‌నూ అవమానపరుస్తున్నారని పేర్కొన్నారు.

Shahrukh Khan: లేడీ గెటప్‌లో షారుఖ్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన కింగ్ ఖాన్

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయని.. ఈ రకంగా ఎవ్వరూ దిగజారుడు రాజకీయాలు చేయలేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయాలు, ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ జీ20 సదస్సుకు రారని.. ప్రధానమంత్రి వస్తే స్వాగతం పలకరని చెప్పారు. మహిళా గవర్నర్‌ను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. గవర్నర్ పర్యటనలకు వెళ్తే, కనీసం ప్రోటోకాల్ పాటించటం లేదని తెలిపారు. ఇలా వ్యవహరించడం వల్లే తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా శోభ వస్తుందా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఆలోచన చేయాలని కోరారు. కృష్ణా జలాల సమస్యపై సమావేశం పెడితే దానికి కేసీఆర్ రారని.. ప్రజా సంఘాలతో పాటు ఎమ్మెల్యేలను, ఎంపీలను కలవట్లేదని పేర్కొన్నారు. కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబ కారణంగా తెలంగాణ పరువు పోతోందన్నారు. తన కుమారుడు ముఖ్యమంత్రి కాడేమోనని ఆలోచనతోనే ఇలాంటి ఘర్షణ వైఖరిని కేసీఆర్ అవలంభిస్తున్నారని విమర్శించారు.

Ashok Khemka: 8 నిమిషాల పని.. 40 లక్షల జీతం.. వద్దంటోన్న ఐఏఎస్ ఆఫీసర్

దేశానికి ఒక విధానం, తెలంగాణకు ఒక విధానం ఉండదని కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. అందరు ముఖ్యమంత్రులకు ఉన్న విధానామే తెలంగాణ ముఖ్యమంత్రికి ఉంటుందని తెలిపారు. కానీ.. కేసీఆర్‌‌ది వితండవాదం, విచిత్రమైన వాదమని ఆరోపణలు చేశారు. దుందుడుకు దుర్మార్గపు విధానంతో వ్యవస్థలను భ్రష్టబట్టిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విధానం ఉంటే తెలంగాణ పూర్తిగా నష్టపోతుందన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమం ఉంటే.. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తారని.. ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేయాలన్నా, పాదయాత్రలు చేయాలన్నా న్యాయస్థానానికి వెళ్లాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు కూడా దీనిపై వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం జరపాలని ప్రజలు కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైఖరిని తెలంగాణ మేధావులు విద్యార్థులు అర్థం చేసుకోవాలని కోరారు. ఇలాంటి వైఖరి కొనసాగితే.. తెలంగాణ విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

Global Economic Downturn: ఇండియా వాణిజ్యంపై ప్రభావం ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. గవర్నర్ ఎవరున్నా.. కొన్ని కనీస మర్యాద పద్దతులు అవలంభించాల్సి ఉంటుందని తెలిపారు. గవర్నర్ బడ్జెట్ సమావేశాలకు పిలిచి, సభ్యులను ఉద్దేశించి ప్రసంగించే సాంప్రదాయం అన్ని రాష్ట్రాల్లో ఉంటుందని.. తెలంగాణలో ఈ అంశానికి కూడా తిలోదకాలు ఇచ్చారని దుయ్యబ్టారు. ఇలాంటి రాజ్యాంగ శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. శకటాల ప్రదర్శనలో తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు చోటు దక్కలేదని.. శకటం పెడితే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టాల్సి ఉంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Show comments