బ్రిటన్ రాజు పర్యటన అంటే ఎంతో హడావుడి.. హంగామా ఉంటుంది. బ్రిటన్ రాజు చార్లెస్ దంపతులు భారత్‌లో పర్యటిస్తున్నారంటే ప్రొటోకాల్ ప్రకారం భారీ బందోబస్తు.. పోలీసుల హడావుడి ఉంటుంది. అలాంటిది చార్లెస్ దంపతులు గత వారం నుంచి దక్షిణ భారత్‌లోని బెంగళూరులో ఉంటున్న సంగతి ఎవరికీ తెలియలేదు. ఓ మెడిటేషన్ సెంటర్‌లో దంపతులిద్దరూ సేదతీరుతున్నారు. అత్యంత రహస్యంగా ఈ పర్యటన సాగుతోంది. తాజాగా ఈ సమాచారం మీడియాకు లీక్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత బ్రిటన్ సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత చార్లెస్‌ది భారత్‌లో ఇదే తొలి పర్యటన.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: కుల గణనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
బ్రిటన్ రాజు చార్లెస్, సతీమణి క్వీన్ కెమిల్లా అక్టోబర్ 27న బెంగళూరుకు వచ్చారు. నాలుగు రోజుల పర్యటన కోసం దంపతులిద్దరూ వచ్చారు. బెంగళూరులోని విశాలమైన ఇంటిగ్రేటివ్ మెడికల్ ఫెసిలిటీలో బస చేశారు. ఇద్దరూ ప్రసిద్ధ హోలిస్టిక్ హెల్త్ సెంటర్ సౌక్యాలో బస చేశారు. ఈ ప్రదేశం యోగా, మెడిటేషన్ సెషన్‌లకు ప్రసిద్ధి. ఇక్కడ ఇతర చికిత్సలతో సహా పునరుజ్జీవన చికిత్సకు ప్రసిద్ధి చెందిందని ఒక అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో కూడా దంపతులిద్దరూ ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంతో సహా అనేక ఆరోగ్య చికిత్సలు తీసుకున్నట్లు సమాచారం. ఉదయపు దినచర్యగా యోగా చేసేవారు. అనంతరం ప్రత్యేకమైన ఆహారం తీసుకున్నారు. ధ్యానంతో పాటు ప్రత్యేకమైన చికిత్సలు కూడా తీసుకున్నట్లు అధికారి పేర్కొన్నారు. దంపతులిద్దరూ 30 ఎకరాల క్యాంపస్ చుట్టూ ఎక్కవ సేపు నడవడం.. సేంద్రీయ వ్యవసాయానికి వెళ్లి ఆనందించేవారని చెప్పారు. గత మూడు రోజులుగా మెడికల్ క్యాంప్‌లో ఇలానే గడిపారని తెలిపారు. బుధవారం పర్యటన ముగించుకుని వెళ్లిపోయినట్లు అధికారి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Bitter Gourd: ఈ విషయం తెలిస్తే కాకరకాయను అసలు వదలరుగా..
కింగ్ చార్లెస్‌కు ఇలాంటి పర్యటనలు చేయడం మొదటిసారి కాదు. 2019లో కూడా తన 71వ పుట్టినరోజు కూడా ఇక్కడే చేసుకున్నారు. యూకే రాజుగా చార్లెస్ పట్టాభిషేక కార్యక్రమానికి హాజరయ్యేందుకు బెంగళూరు డాక్టర్ ఇస్సాక్ మథాయ్ ఆహ్వానింపబడ్డారు. భారతదేశం నుంచి ఆహ్వానించబడిన కొద్దిమంది వ్యక్తుల్లో ఇతడొకరు. చార్లెస్ చాలా సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Top10 Features on New Cars: కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? గమనించాల్సిన టాప్10 ఫీచర్లు..