Congress: కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే బీజేపీపై వంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘‘ నాటు నాటు’’ పాటకు ‘‘ ది ఎలిఫెంట్ విస్పరర్స్’’ డాక్యుమెంటరీలకు ఆస్కార్ అవార్డులు రావడాన్ని ప్రస్తావిస్తూ పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మేము చాలా గర్వంగా ఉన్నాము.. అయితే నా ఏకైక అభ్యర్థన ఏంటంటే బీజేపీ ఈ అవార్డులు తన ఘనత అని చెప్పుకోవద్దని ఖర్గే అన్నారు.
Read Also: Viral News : భార్య నిద్ర.. భర్త పోలీస్ కంప్లైంట్
సినిమాకు మేమే కథ రాశాం, మేమే దర్శకత్వం వహించాం, మోదీ జీ దర్శకత్వం వహించామని క్రెడిట్ తీసుకోవద్దని సెటైర్లు వేశారు. ఖర్గే వ్యాఖ్యలతో సభలో పాలక, విపక్షాల సభ్యులు అంతా నవ్వాడు. రాజ్యసభ ఛైర్మన్ మరియు ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్, విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, మన్సుఖ్ మాండవీయ ఖర్గే నవ్వుతూ కనిపించారు. ఆర్‌ఆర్‌ఆర్ స్క్రిప్ట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌ను మోడీ ప్రభుత్వం పార్లమెంటుకు నామినేట్ చేసిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆస్కార్ విజయం సాధించిన రెండు చిత్రాలు కూడా సౌత్ ఇండియా నుంచి వచ్చాయని ఖర్గే అన్నారు. ఈ వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మాట్లాడుతూ.. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ప్రాంతానికి చెందిన వారైనా, వారు భారతీయులే అంటూ వ్యాఖ్యానించారు.
Oscar winning 'RRR' and The Elephant Whisperes' are India's contributions to the world.
We request Modi ji not to take the credit for their win.
:Congress President and LoP in Rajya Sabha Shri @kharge pic.twitter.com/43loVpofCF
— Congress (@INCIndia) March 14, 2023