NTV Telugu Site icon

Parliament: నిర్మలా సీతారామన్‌ని ‘‘మాతా జీ’’గా పిలిచిన ఖర్గే.. ధన్‌ఖర్ రిప్లైతో రాజ్యసభలో నవ్వులు..

Parliament

Parliament

Parliament: బడ్జెట్ చర్చ సందర్భంలో రాజ్యసభలో ఫన్నీ సందర్భం ఎదురైంది. వాడీ వేడి చర్చ మధ్యలో రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్‌ఖర్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేపై వేసిన సెటైర్లతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంలో ఈ ఘటన ఎదురైంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. బీహార్, ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల ప్లేట్లు ఖాళీగా ఉన్నాయని అన్నారు.

నిన్న సమర్పించిన బడ్జెట్‌లో ఏపీ, బీహార్‌కి తప్ప మారే రాష్ట్రానికి ఏం లభించలేదని, ఆ రాష్ట్రాల ప్లేట్లలో పకోడీ, జిలేబీ వడ్డించారని ఖర్గే అన్నారు. తాను ఇలాంటి బడ్జెట్‌ని ఎప్పుడూ చూడలేదని, ఈ బడ్జెట్ బీజేపీ తన కుర్చీని కాపాడుకునేందుకు మాత్రమే అని, దీన్ని ఖండిస్తున్నానని చెప్పారు. దీనిపై స్పందించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని అనుమతించాలని ఖర్గేని చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ కోరారు.

Read Also: Anoosha Krishna: తండ్రి వయసున్న నిర్మాత ఎంగేజ్మెంటయినా పర్లేదన్నాడు.. హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు

ఈ సమయంలో ఖర్గే ‘‘ నన్ను పూర్తిచేయనివ్వండి, మాతాజీ మాట్లాడటంతో నిపుణులని అందరికి తెసులు’’ అంటూ నిర్మలా సీతారామన్‌ని ఉద్దేశించి అన్నారు. దీనికి ధన్‌ఖర్ రిప్లై ఇస్తూ ‘‘ మాతాజీ కాదు, ఆమె మీకు కూతురు లాంటిది’’ అనడంతో ఒక్కసారిగా అధికార, ప్రతిపక్ష ఎంపీలు నవ్వారు. ఖర్గే ఆరోపణలపై స్పందించిన ఆర్థిక మంత్రి.. తాము బడ్జెట్‌లో ఏ రాష్ట్రాన్ని కూడా విస్మరించలేదని ఆమె అన్నారు. ప్రతీ బడ్జెట్లో అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించలేమని చెప్పారు. ఉదాహరణకు మహరాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలో వంధవన్ అనే పట్టణంలో ఓడరేవు ఏర్పాటు చేయాలని భావించామని, అయినప్పటికీ మహారాష్ట్ర పేరును ప్రస్తావించలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. పేరు చెప్పకపోయినంత మాత్రనా మహారాష్ట్ర విస్మరించబడుతోందని అర్థం కాదని చెప్పారు.