Khap Panchayat: స్వలింగ వివాహాలు, లివ్-ఇన్ రిలేషన్ నిషేధించాలి.. జంతువులు కూడా ఇలా చేయవు..
- స్వలింగ వివాహాలు..సహజీవనంపై ఖాప్ పంచాయతీ ఆందోళన..
- బ్యాన్ విధించాలని లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక..
- జంతువులు కూడా ఇలా చేయవని ఖాప్ పంచాయతీ పెద్దల వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khap Panchayat: హర్యానా జింద్‌లోకి ఖాప్ పంచాయతీ పెద్దలు ‘‘స్వలింగ వివాహాలు’’, ‘‘సహజీవనం’’పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయ విలువలు, సామాజిక నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశారు. స్వలింగ వివాహాలు, లిన్ ఇన్ రిలేషన్లపై నిషేధిం విధించాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి 300 మంది పంచాయతీలకు చెందిన నేతలు ఈ సమాజిక సమస్యలపై తమ ఆందోళనల్ని లేవనెత్తారు. జూలై 28 ఆదివారం రోజున నిర్వహించిన ‘‘మహా పంచాయత్’’తో తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేకుండా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
Read Also: Dhanush ILAYARAJA: మోత మోగించడానికి రెడీ అవుతున్న ధనుష్ “ఇళయరాజా”
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
బెనైన్ ఖాప్ చీఫ్ రఘుబీర్ నైన్ లివ్-ఇన్ రిలేషన్షిప్స్ మరియు స్వలింగ వివాహాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. జంతువులు కూడా ఇలాంటి వాటికి పాల్పడవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సమ్మతితో నిర్వహించే ప్రేమ వివాహాలకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెబుతూనే, ఒకే గోత్రంలో వివాహాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మరో ఖాప్ నేత సంతోష్ దహియా మాట్లాడుతూ.. ఒకే గోత్రంలో వివాహాలు సామాజికంగా ప్రభావం చూపించడమే కాకుండా, జన్యుపరమైన సమస్యలకు దారి తీస్తాయని చెప్పారు. కాబట్టి ఒకే గోత్రంలో వివాహాలను నిషేధించాలని సూచించారు.
లివ్-ఇన్ రిలేషన్షిప్ భావనను మరియు భారతదేశంలో దాని చట్టబద్ధతను కూడా నాయకులు వ్యతిరేకించారు. “లివ్-ఇన్ సంబంధాలు కుటుంబ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు. ఇవి సమాజం, పిల్లలు, మన సంస్కృతిపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని దహియా ఆందోళన వ్యక్తం చేశారు. లివ్ ఇన్ సంబంధాల వల్ల మహిళలు ప్రభావితమవుతున్నారని అన్నారు. ఖాప్ పంచాయితీ ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి చట్ట సవరణలను కోరాలని అనుకుంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని, ఇందుకోసం 51 మంది సభ్యులతో కమిటీని వేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!