NTV Telugu Site icon

Canada: ఖలిస్తానీ టెర్రరిస్ట్, నిజ్జర్ సహాయకుడు అర్ష్‌దీప్ దల్లా అరెస్ట్..

Arshdalla

Arshdalla

Canada: ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ దల్లాని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో దేశంలో జరిగిన కాల్పులకు సంబంధించి అర్ష్ దల్లాని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతేడాది కెనడాలో హత్య చేయబడిని ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కి హర్ష్ దల్లా అత్యంత సన్నిహితుడు. భారత్ ఇతడిని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది.

అక్టోబరు 27 లేదా 28న మిల్టన్ పట్టణంలో జరిగిన సాయుధ ఘర్షణలో ఇతని ప్రయేయం ఉందని తెలుస్తోంది. దల్లా అరెస్ట్ గురించి సమాచారం అందినట్లు భారత భద్రతా సంస్థలు ధ్రువీకరించాయి. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం, భారతదేశంలో వివిధ నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న అర్ష్ డల్లా తన భార్యతో కలిసి కెనడాలో నివసిస్తున్నాడు. కెనడియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, ముఖ్యంగా హాల్టన్ రీజినల్ పోలీస్ సర్వీస్ (HRPS), ఇటీవలి కాల్పులపై దర్యాప్తు చేస్తోంది.

Read Also: Vikrant Massey: దేశంలో ముస్లింలకు ఎలాంటి ప్రమాదం లేదు..కానీ.. ప్రముఖ హీరో కీలక కామెంట్స్

భారత అధికారులు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. కెనడియన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. దల్లా ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) ఉగ్రసంస్థ తాత్కాలిక చీఫ్‌గా ఉన్నాడు. నిజ్జర్ మరణం తర్వాత అతడి వారసుడిగా పరిగణించబడుతున్నాడు.

ఈ ఏడాది పంజాబ్‌లోని మోగా జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు బల్జీందర్ సింగ్ బల్లిని హత్య చేశారు. ఈ ఘటనలకు అర్ష్‌దీప్ దల్లా బాధ్యత వహించాడు. తన పోస్ట్‌లో, బల్జిందర్ సింగ్ బల్లి తన భవిష్యత్తును నాశనం చేశాడని మరియు తనను గ్యాంగ్‌స్టర్ల ప్రపంచంలోకి నెట్టాడని డల్లా పేర్కొన్నాడు. తన తల్లి పోలీసు కస్టడీ వెనుక కాంగ్రెస్ నాయకుడి హస్తం ఉందని, అదే తనను ప్రతీకారం తీర్చుకోవాలని ప్రేరేపించిందని ఆయన అన్నారు.

ఎన్ఐఏ టెర్రరిస్టు జాబితాలో మోస్ట్ వాంటెడ్ పర్సన్ అర్ష్ దల్లా .. గత మూడు నాలుగేళ్లుగా కెనడా నుంచి పంజాబ్‌లో తన నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. పంజాబ్‌లో పలు టార్గెటెడ్ కిల్లింగ్స్‌లో అతడి ప్రమేయం ఉంది. కెనడాలోని హిందూ దేవాలయంపై ఖలిస్తానీ ఉగ్రవాదులు దాడి చేసిన కొద్ది రోజుల తర్వాత డల్లా అరెస్టు జరిగింది. నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై ఖలిస్తానీలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనని భారత్ తీవ్రంగా ఖండించింది.

Show comments