ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి ప్లాన్ తెలుసుకుని పోలీసులే షాక్‌కు గురయ్యారు. ఇక అంతకంటే ముందే సుప్రీంకోర్టు దగ్గరే భారీ దాడికి ప్లాన్ చేశాడు. సుప్రీంకోర్టు జడ్జిలపై కత్తితో దాడి చేయాలని ప్లాన్ వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కానీ అక్కడ విఫలం కావడంతో ముఖ్యమంత్రి నివాసం దగ్గర అమలు చేశాడు.
ఇది కూడా చదవండి: Houthi-Israel: హౌతీయుల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు.. వీడియోలు వైరల్
ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కత్తితో పొడిచేందుకు నిందితుడు సకారియా ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ముఖ్యమంత్రి నివాసం దగ్గర బాగా క్లౌడ్ ఉండడం.. భద్రతా కూడా ఎక్కువగా ఉండడంతో కత్తిని బయటే పడేసి లోపలికి వెళ్లాడు. అనంతరం వినతిపత్రం ఇస్తూనే రేఖా గుప్తాతో వాగ్వాదానికి దిగి దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా ఆమెను తోసేందుకు ప్రయత్నించగా.. జుట్టు పట్టుకుని లాగేందుకు ప్రయత్నించాడు. బలంగా దాడి చేయడంతో రేఖా గుప్తాకు గాయాలయ్యాయి. ఇంతలోనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రేఖా గుప్తాను నోటికొచ్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: CM Chandrababu: చంద్రబాబు సీరియస్ వార్నింగ్..! నిజంగానే వారిపై చర్యలు ఉంటాయా..?
అయితే తొలుత సుప్రీంకోర్టు దగ్గర జడ్జిలపై దాడి చేయాలని సకారియా ప్రణాళిక రచించాడని.. అయితే అక్కడ పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉండడంతో ప్రణాళికను మార్చుకున్నాడని.. అక్కడ నుంచి ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి రేఖా గుప్తాపై దాడి చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో 8 వారాల్లోగా కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంతో పెద్ద ఎత్తున జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులు నిరసనలు వ్యక్తం చేశారు. తీర్పును సమీక్షించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్‌కు లేఖలు రాశారు. అయితే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన జంతు ప్రేమికుడు సకారియా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. వీధి కుక్కలను తొలగించాలన్న తీర్పు రుచించలేదు. దీంతో గుజరాత్ నుంచి ఢిల్లీకి వచ్చి జడ్జిలపై దాడి చేయాలని అనుకున్నాడు. అక్కడ భారీగా సెక్యూరిటీ ఉండడంతో.. అక్కడ నుంచి ముఖ్యమంత్రి రేఖా గుప్తా నివాసానికి వచ్చి దాడి చేశాడు.
ఇక ఈ కేసులో రెండో నిందితుడు సయ్యద్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిరంతరం సకారియాతో టచ్‌లో ఉన్నట్లుగా కనిపెట్టారు. అంతేకాకుండా డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు గుర్తించారు.
సకారియా నేర చరిత్ర..
ఇక ప్రధాన నిందితుడు సకారియాను న్యాయస్థానం ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. దీంతో అతడి నుంచి అనేక విషయాలను పోలీసులు రాబడుతున్నారు. సకారియా వృత్తిరీత్యా ఆటోరిక్షా డ్రైవర్. 2017 నుంచి 2024 వరకు రాజ్‌కోట్‌లోని భక్తినగర్ పోలీస్ స్టేషన్‌లో ఐదు దాడి కేసులు, మద్యం కేసులతో పాటు పలు కేసులు ఉన్నాయి. గుజరాత్ నిషేధ చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద 2017, 2020, 2022లో రెండు సార్లు చర్యలు కూడా తీసుకున్నారు. 2021లో బాంబే పోలీస్ చట్టంలోని సెక్షన్ 56 కింద సకారియాను బహిష్కరించారు.
ఇక 2017లో సకారియా ఒక వ్యక్తి తలపై బ్యాట్‌తో కొట్టాడు. అంతేకాకుండా 2022లో భార్యతో గొడవ పడి కుటుంబ సభ్యులందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. ఆ సమయంలో బ్లేడ్‌తో తన తలపై దాడి చేసుకోవడంతో తొమ్మిది కుట్లు పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు మొబైల్‌లోని సమాచారం, అతడి స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మరింత సమాచారాన్ని సేకరించారు.
అవినీతి అంశంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన చేసినట్లే వీధి కుక్కలను తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నిరసన చేపట్టాలని సకారియా యోచిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇక నిందితుడి మొబైల్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? లేదంటే దాచి పెట్టాడా? అన్న విషయాలను లోతుగా పరిశీలిస్తున్నారు.
